ఈ మధ్యకాలంలో నెట్టింట్లో పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ తరహా వీడియోలు మరీ ముఖ్యంగా మన దేశంలో మాత్రం ఎందరో నెటిజనుల నుంచి కామెంట్లు, లైకులు అందుకుంటున్నాయి. పెళ్లి భారత్ లలో డాన్సులు, పెళ్లి సంగీత్ లలో డాన్సులే కాదు ఏకంగా పెళ్లి వేడుకలపై కూడా వధూవరులు డాన్సులతో అదరగోడుతూ.. కొత్తజీవితానికి కావాల్సిన ఆనందాన్ని పెళ్లి వేదిక నుంచే ప్రారంభిస్తున్నారు. ఇక ఇక్కడ వీరు తమ డాన్సులతో అదరగోట్టేందుకు ఎంచుకుంటున్న పాటలు కూడా అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఆ పాటలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
అయితే భారత్ లో మాత్రమే కాదు మా వద్ద కూడా పెళ్లికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారుతాయని భావించిన ఓ జంట పెళ్లి వేదకపై డాన్స్ చేసింది. ఈ క్రమంలో వధువును తన భుజాన ఎక్కించుకున్న వరుడు అదుపుతప్పి పడిపోవడంతో ఈ వీడియో అనుకున్న దానికంటే ఎక్కువ వైరల్ అవుతోంది. తాజాగా.. అటువంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో స్పెషాలిటీ ఏంటంటే.. ఆ వీడియో చూసి మీరు నవ్వు ఆపుకోలేరు. మీరు ఆ వీడియో చూసి నవ్వకుండా ఉంటే గ్రేట్. అవును.. ఆ వీడియో నూతన వధూవరులకు చెందినది.
తమ పెళ్లి రోజున ఫుల్ హ్యాపీ మూడ్‌లో ఉన్న పెళ్లికొడుకు, పెళ్లి కూతురు తమ పెళ్లికి వచ్చిన అతిథుల ముందు డ్యాన్స్‌లు చేయడం ప్రారంభించారు. పెళ్లికొడుకు డ్యాన్స్ చేస్తూ.. పెళ్లికూతురును తన వెనుక ఎత్తుకున్నాడు. ఎత్తుకొని డ్యాన్స్ చేయబోయి బ్యాలెన్స్ తప్పాడు. దీంతో పెళ్లికొడుకు, పెళ్లికూతురు.. ఇద్దరూ కింద పడిపోయారు. దీంతో అక్కడున్న అతిథులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయినప్పటికీ.. వెంటనే తేరుకున్న పెళ్లికూతురు.. మళ్లీ డ్యాన్స్ వేయడం ప్రారంభించింది. అందుకే ఈ వీడియో ప్రస్తుతం అంతగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు అయితే తమకు తోచిన విధంగా కామెంట్లు చేస్తున్నారు.
View this post on Instagram
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more