ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఎందరెందరిపైనో ప్రభావం చూపింది. అందులో కొందరినీ కబళించి వేసింది. అయితే కరోనా మహమ్మారి కారణంగా మరణించిన వారి కుటుంబాలకు పరిహారం ఇప్పించాలని ఇప్పటికే దేశ సర్వోన్నత న్యాయస్థానంలో పిటీషన్లు కూడా దాఖలైన విషయం తెలిసిందే. మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని అత్యున్నత న్యాయస్థానం కూడా కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ క్రమంలో పరిమహారంగా ఎంత మొత్తాన్ని బాధిత కుటుంబాలకు ఇవ్వాలన్న విషయాన్ని నిర్ణయం తీసుకోవాల్సిందిగా కూడా న్యాయస్థానం తేల్చిచెప్పింది. దీంతో కరోనా మహమ్మారికి గురై ప్రభావంతో మరణించిన మృతుల కుటుంబాలు అటు కేంద్రంతో పాటు ఇటు సుప్రింకోర్టు వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు.
అయితే కరోనా మహమ్మారి కారణంగా మరణించిన మృతుల కుటుంబాలకు పరిహారం అందించే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా మృతుల కుటుంబాలకు పరిహారంగా అందించేందుకు ఆంధ్రప్రదేశ్ కుటుంబం పూనుకుంది. ఇప్పటికే కరోనా తల్లిదండ్రులను కోల్పోయిన బిడ్డలను అందుకునేందుకు ముందుకు వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు మరో అడుగు వేసి.. మృతుల కుటుంబాలన్నింటికీ పరిహారాన్ని అందించనుంది. రాష్ట్రంలో కరోనాతో మరణించిన మృతుల వివరాలన్నింటినీ సేకరించి.. వారందరి కుటుంబాలకు పరిహారాన్ని అందేలా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంబంధిత వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులకు అదేశాలు జారీ చేశారు.
ఈ పరిహారం జారీలో ఎక్కడా ఎలాంటి అవకతవకలు జరగకుండా జిల్లా రెవెన్యూ అధికారుల తగు చర్యలు తీసుకోవాలని అదేశించారు, పరిహారాలన్నీ డీఆర్వో అధికారుల సమక్షంలోనే జరగాలని సూచించారు. ఈ మేరకు కోవిడ్ మృతుల కుటుంబాలకు రూ.50 వేల పరిహారం చెల్లింపుపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. విపత్తు నిర్వహణ నిధి నుంచి చెల్లించాలని కలెక్టర్లను ఆదేశించింది. డీఆర్వో నేతృత్వంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు ద్వారా బాధిత కుటుంబాలకు రెండు వారాల్లో చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. కుటుంబ సుభ్యుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం సూచించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more