కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీనివాసుడి దర్శనం కోసం ఇప్పటికే ఎంతో మంది సాధారణ భక్తులు వేచిచూస్తున్న విషయం తెలిసిందే. కోవిడ్ రెండో దశ అన్ లాక్ నేపథ్యంలో అమల్లోకి వచ్చిన ఆంక్షలతో శ్రీవారి దర్శనభాగ్యం సామాన్య భక్తులకు అందకుండా పోయింది. ఆన్ లైన్లో ప్రత్యక దర్శనం సహా సర్వదర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు మాత్రమే అనుమతిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. దీంతో వడ్డీకాసుల వాడిని దర్శంచుకునే భాగ్యం లభించక చాలా మంది భక్తులు నిరాశకు గురవుతున్నారు. తిరుమలలో అనునిత్యం ఓం నమో నారాయణాయ అనే భక్తుల శరణుఘోషతో ప్రతిధ్వనించే సప్తగిరులు.. మౌనగిరిలుగా మారుతున్నాయన్న విమర్శలు వినిపించాయి.
అయితే కోవిడ్ మహమ్మారి కారణంగా తగు నిబంధనలు, జాగ్రత్తలు పాటిస్తూనే నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోంది. అయితే టీటీడీ విడుదల చేసిన టికెట్లు హాట్ కుకుల్లా అయిపోతున్నాయి. వేల టికెట్లు నిమిషాల వ్యవధిలో బుక్ అవుతున్నాయి. అందరూ తమకు వెంకన్న దర్శనం కావాలని టికెట్ల విడుదల సమయం వరకు వేచివుండటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో కలియుగ ప్రత్యక్షదైవం భక్తులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. అయితే ఇలా టికెట్ దొరకని వారి కోసం టీటీడీ, ఏపీఎస్ ఆర్టీసీ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ విధానం ద్వారా తిరుమల శ్రీవారిని దర్శించుకునే అవకాశాన్ని ఇటీవల కల్పించింది.
ఇందులో భాగంగా దేశంలోని పలు ప్రాంతాలు నుండి తిరుపతికి ఆర్టీసీ బస్సుల్లో వచ్చే ప్రయాణికులకు రోజుకు 1000 దైవ దర్శనం టికెట్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో తిరుమలకు దర్శనం కోసం వచ్చే భక్తులు www.apsrtconline.org.in వెబ్‌సైట్‌లో ప్రయాణ చార్జీలు, జీఎస్టీతో పాటు రూ. 300 చెల్లించి శీఘ్ర దర్శనం టికెట్‌ను పొందవచ్చు. ఇలా టికెట్ పొందిన వారికి ప్రతి రోజూ ఉదయం 11:00 గంటలకు, సాయంత్రం 4:00 గంటలకు తిరుమల శ్రీవారి దర్శనం కల్పిస్తారు. తిరుమల బస్ స్టేషన్‌కు చేరుకున్న తర్వాత శ్రీవారి దర్శనం చేసుకోవడంలో ఆర్టీసీ సూపర్ వైజర్లు సహాయం చేస్తారు. విజయవాడ, గుంటూరు, బెంగుళూరు, చెన్నై, కంచి, వెల్లూరు, పాండిచ్చేరి, హైదరాబాద్ తదితర 650 ప్రధాన నగరాల నుంచి తిరుమల దర్శనం కోసం వచ్చే భక్తులు ఆన్‌లైన్ విధానంలో టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more