ఆంధ్రప్రదేశ్ మాజీ పిసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువే. 2004 నుంచి పదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగినా.. ఎక్కడి ఆయన చుట్టూ ఒక్క అవినీతి అరోపణ లేదు. ఆయనను వేలెత్తి చూపించిన వారు లేరు. అయితే చేతులు జోడించి నమస్కరిస్తూ.. అయ్యా మాకు ఈ సాయం చేయండీ అన్నవారు మాత్రం ఎంతో మంది ఉన్నారు. రాజకీయాల్లో వున్న వ్యక్తికి ఇలాంటి విన్నపాలు రావడం షరామామూలే. అయితే రాజకీయాల నుంచి తప్పుకున్న తరువాత కూడా ఆయనకు నిత్యం ఇలాంటి విన్నపాలు వస్తూనే వుంటాయి. అయినా ఆయన తనకు చేతనైనంత సాయం చేస్తూనేవుంటారు.
రాజకీయాల నుంచి వైదొలగిన తరువాత పూర్తిగా ఇంటి మనిషిగా మారి.. వ్యవసాయ పనులు, ఆధ్యాత్మిక వ్యవహారాల్లో నిమగ్నమయ్యారు. అయితే రాష్ట్రంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేసేందుకు భార్యతో కలిసి బైక్పై వచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు అప్పట్లో నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. ఆయన సింప్లిసిటీని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. అలాంటి ఉన్నతమైన నేతను తాజాగా ఒకరు నిందిస్తూ.. ఆయనను తన ఇంట్లోనే స్థంబానికి కట్టేశారు. ఎవరా పని చేసిందని అవేశం తెచ్చుకోకండీ.. ఈ పని చేసింది ఎవరో బయటివారు కాదు.. స్వయంగా ఆయన మనవరాలే.
తాతయ్య మీద ప్రేమతోనే అమె ఆయనను కట్టేసింది. తనతో ఎక్కువ సమయాన్ని గడపడం లేదని, కోపం తెచ్చుకున్న ఆయన మనవరాుల సమైరా.. ఆయనను స్థంబానికి కట్టేసింది. ఇకపై ఇంట్లోనే ఉంటూ తనతో ఆడుకోవాలని చిన్నారి.. తాతయ్యను ప్రేమపూర్వకంగా అదేశించింది కూడా. ఈ మేరకు రఘువీరా ఈ ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. దాంతో పాటు ఆయన పోస్టు చేసిన వివరాలతో కానీ విషయం అర్థం కాలేదు. ఈ పోస్టుపై నెటిజనులు లైకులు, కామెంట్లతో స్పందించడంతో అది కాస్తా వైరల్ అయ్యింది.
Annoyed that I haven’t spent enough time with her, my grand daughter Samaira tied me up to a pillar and demanded that I stay at home to play with her. pic.twitter.com/JISjujg8GV
— Dr. N Raghuveera Reddy (@drnraghuveera) November 2, 2021
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more