తమిళనాడులో ఏకబిగిన కురిసిన వర్షాలు రాజధాని చెన్నైని చెరువులా తలపింపజేశాయి. చెన్నై సహా 26 జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కుమ్మేసిన వర్షాలు.. ఆయా జిల్లాల్లోని లోత్తట్టు ప్రాంతాలను జలదిగ్భంధంలోకి నెట్టివేశాయి. ఇప్పటికే వరుణుడు పగబట్టినట్టుగా వర్షం కురుస్తుండగా, ఇక తాజాగా భారత వాతావరణ శాఖ అధికారులు తాజాగా వెలువరించిన వార్త చెన్నైవాసులను తీవ్ర అందోళనకు గురిచేస్తోంది. ఈ నెల 10, 11 తేదీలలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలు జారీ చేసింది. చెన్నై నగరంతో పాటు సమీప 14 జిల్లాలకు కూడా ఐఎండీ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
ఇప్పటికే నిండా ముంచేసిన వర్షంతో.. అవస్థలు పడుతున్న స్థానికులు గజం స్థలం దొరికినా చాలు అనుకుంటుండగా, ఐఎండీ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 2015లో సంభవించిన వరదల భీభత్సాన్ని తలచుకుని.. అలాంటి ఘటనలు పునరావృతం అవుతాయా.? అని అందొళన చెందుతున్నారు. చెన్నై సహా దాని సమీప 14 జిల్లాల్లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశాలు వున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కుడ్డలూర్, విల్లుపురం, చెన్నై, కాంచిపురం, చెంగళ్ పట్టు, తిరువళ్లూర్, వెల్లూర్, రాణిపేట్, తిరుపట్టూర్, నాగపట్టణం, మియినలద్దుత్తురయ్,కాళ్లకూర్చి, తిరువణ్ణామలై, సేలం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురస్తాయని హెచ్చిరకలు జారీచేశారు.
దీనికి తోడు ఈ పద్నాలుగు జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు కూడా కురిసే అవకాశం వుందని అధికారులు తెలిపారు. కాగా క్రితం రోజున రాజధాని చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూర్లో భారీ వర్షాపాతం నమోదైంది. వానలకు చెన్నైశివారు ప్రాంతాలు నీటితో నిండిపోవడంతో స్థానికంగా జనజీవనం కూడా స్థంభించిపోయింది. ఆయా జిల్లాల్లోని వాహనాలు కూడా పూర్తిగా వర్షపు నీటిలో మునకేశాయి. నగరంలోని ప్రధాన రహదారులు నదులను తలపిస్తున్నాయి. చెన్నై పరిసరాల్లోని మూడు రిజర్వాయర్ల నుంచి నీటి విడుదల కొనసాగుతుండడంతో చెన్నై నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో ఇండ్లలోకి వరద నీరు చేరింది.
కొళత్తూర్, పెరవళ్లూర్, కేకేనగర్, విల్లుపురం, కాంచీపురం, చెంగళ్ పట్టు, తిరువళ్లూర్ సహా పలుజిల్లాల్లో కుండపోత వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇండ్లలోకి నీరు చేరి జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విద్యుత్ సరఫరా లేక బయటకు రాలేక.. ఇండ్లలో ఉండలేక అష్టకష్టాలు పడుతున్నారు. చాలాచోట్ల రహదారులు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కార్పొరేషన్ అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. మోటార్లతో నీటిని తోడే పనిలో నిమగ్నమయ్యారు. తిరువళ్లూర్, చెంగల్పట్టు, మధురైలో సహాయక చర్యలు కొనసాగుతుండగా.. సహాయక చర్యల్లో నాలుగు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొన్నాయి.
ఇదిలా ఉండగా.. మరో రెండు రోజులు తమిళనాడులో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. సోమ, మంగళవారాల్లో చెన్నైలో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించగా.. ఇప్పటికే జలదిగ్బంధంలో ఉన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో జనం భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో మూడు రోజుల పాటు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చెన్నై, సమీప జిల్లాల్లో ఇవాళ, రేపు విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురంలో పాఠశాలలు, కళాశాలలకు, తిరువళ్లూర్ పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more