కరోనా వ్యాక్సిన్లు ప్రజలందరూ తీసుకునేలా ప్రోత్సహించే నిమిత్తం విదేశాల్లోని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మద్యాన్ని అక్కడి యువతకు ఉచితంగా ఆఫర్ చేసిన వార్తలు విన్నాం. ఇక మనదేశంలో మాత్రం కరోనా టీకా తీసుకోని వారిపై ఆంక్షలను పెట్టారు. కరోనా టీకా తీసుకోని మందు బాబులకు మద్యాన్ని అమ్మరాదని కూడా అదేశాలు జారీ చేశారు. ఇక కరోనా వాక్సీన్ తీసుకోవాలని భావించే వారికి ఇళ్ల వద్దకే వచ్చి మరీ టీకాలను వేస్తున్నారు. తద్వారా రాష్ట్రాల నుంచి మొదలుకుని దేశవ్యాప్తంగాకరోనాను తరమికోట్టాలని ప్రభుత్వాలు సంకల్పనకు ప్రజలు కూడా మద్దతునిస్తున్నారు.
అయితే కరోనా కేసులు అధికంగా వెలుగుచూసిన పలు రాష్ట్రాలలో మహారాష్ట్ర కూడా ఒకటి. ఈ క్రమంలో మహారాష్ట్రలోనూ కరోనాను తరిమికోట్టాలని ఆ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో నూటికి నూరు శాతం అందరికీ కరోనా టీకాలను ఇవ్వాలని ఆరోగ్యశాఖ అధికారులకు ప్రభుత్వం అదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో చంద్రపూర్ మునిసిపల్ కార్పొరేషన్ ప్రజాప్రతినిధులు వినూతన్నంగా అలోచించారు. ఊరికే వచ్చి కరోనా టీకాను తీసుకోమ్మంటే సుముఖత వ్యక్తం చేయని ప్రజలకు ఆశపెట్టి మరీ టీకాలను తీసుకునేలా చేస్తోంది. అంతేకాదు తమ ఇంటి సభ్యులను కూడా వారే ప్రోత్సహించి టీకా కేంద్రాలకు పంపే విధంగా ప్రేరణ కల్పించేలా చెస్తోంది.
అదెలా అంటారా.. వాయిదాల పద్దతిలో ఏదో ఒక వస్తువును ఇస్తేనే కళ్లకు అద్దుకుని తీసుకునే ప్రజల నాడిని పట్టిన స్థానిక సంస్థ.. కరోనా టీకాను తీసుకున్నవారికి బంపర్ లక్కీ డ్రాను ప్రకటించింది. పైగా ఈ లక్కీ డ్రాలో ఎల్‌ఈడీలు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు నుండి వాషింగ్ మెషీన్ల వరకు మంచి ఆకర్షణీయమైన బహుమతులను గెలుచుకోవచ్చు అని తెలిపింది. అంతేకాదు నవంబర్ 12 నుంచి 24 వరకు సమీపంలోని వ్యాక్సిన్ సెంటర్‌ల వద్ద వ్యాక్సిన్‌లు తీసుకున్నవాళ్లకు మాత్రమే ఈ అవకాశం ఉంటుందని చంద్రపూర్ మున్సిపల్ కార్పొరేషన్ పేర్కొంది.
ఈ మేరకు మేయర్ రాఖీ సంజయ్ కంచర్లవార్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో పౌరులకు ప్రోత్సాహకాలను అందించాలని నిర్ణయించడంతోనే ఈ లక్కీ డ్రా ప్రకటించినట్లు స్పష్టం చేసింది. ఈ క్రమంలో పౌర కమీషనర్ రాజేష్ మోహితే కూడా ఇతర అధికారులను, ప్రజలను తమ సమీపంలోని సివిక్-రన్ ఇనాక్యులేషన్ సెంటర్‌కు వెళ్లి వ్యాక్సిన్‌లు వేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాదు ఇప్పటివరకు నగరంలో అర్హులైన వ్యక్తుల సంఖ్యతో పోలిస్తే వ్యాక్సిన్‌లు తీసుకున్నవారి సంఖ్య ఇంకా తక్కువగానే ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
పైగా పౌరసరఫరాల శాఖ ఆరోగ్య విభాగం సుమారు 21 కేంద్రాల్లో టీకాలు వేసే సౌకర్యాలను ఏర్పాటు చేసిందన్నారు. క్రయ విక్రయలు చేసేవాళ్లు, ఉద్యోగస్తులు, అధికారులు, ప్రజలతో నిత్యం సంప్రదింపులు చేసే వాళ్లు, తదితరులు కనీసం ఒక్కడోస్ అయిన తీసుకుంటేనే నగరంలోని మార్కెట్‌లోకి అనుమతిస్తామని లేకుంటే అనుమతించేదే లేదని మోహితే చెప్పారు. అంతేకాక ప్రభుత్వ ఆదేశాల మేరకు నూరుశాతం వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని సాధించే దిశగా తాము ఈ చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more