ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక పూర్తిస్థాయి రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రెండేళ్లుగా నిరసన ప్రదర్శనలు చేస్తున్న ఆప్రాంత రైతులు తిరుపతి వరకు 45 రోజుల మహాపాదయాత్రను నిర్వహిస్తూ కాలిబాటన తిరుపతికి పయనమయ్యారు. పది రోజుల తరువాత ఇవాళ ప్రకాశం జిల్లాలోకి అడుగుపెట్టిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు. అయితే రైతులు అగకుండా ముందుకు కదలుతుండటంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు అలుముకున్నాయి. పాదయాత్రగా ముందుకు సాగుతున్న రైతులపై ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చదవాడ వద్ద రైతులపై పోలీసులు లాఠీలను ఝుళిపించారు.
పోలీసుల విచక్షనారహిత లాఠీచార్జీపై రైతులు ఎదురుతిరిగారు. ఎందుకు దాడి చేస్తున్నారని, తాము నేరస్థులం కాదని, తమ పాదయాత్రకు రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు కూడా అనుమతినిచ్చిందని చెప్పారు. అయినా పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఈ తరుణంలో రైతులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అయినా వెనక్కుతగ్గని రైతులు ముందకు కలిలే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ముందుకు కదులుతున్న రైతుపై పోలీసు లాఠీతో కొట్టడంతో.. సంతనూతలపాడుకు చెందిన రైతు ఆళ్ల నాగార్జున అనే రైతు చేయి విరిగింది. దీంతో అమరావతి రైతులు పోలీసులు తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు,
ఇక మరోవైపు మహాపాదయాత్రగా కదిలివెళ్తున్న అమరావతి రైతులకు ప్రతీ గామంలోని రైతుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. స్థానిక రైతులు పెద్దఎత్తున్న వారికి మద్దతు పలుకుతున్నారు. అమరావతి రైతులను తమ గ్రామంలోకి రాగానే వారికి డప్పు చప్పుళ్లతో ఎదుర్కోని తమ గ్రామ పోలిమేర దాటే వరకు వారి వెంట వెళ్తున్నారు. అయితే ఇలా గ్రామాల వారీగా రైతులు అమరావతి రైతులకు మద్దతునిస్తున్న నేపథ్యంలో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడికక్కడ రోడ్లను దిగ్భంధించి చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. పోలీసుల ఆంక్షల మధ్య రైతుల పాదయాత్ర కోనసాగుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more