Revanth Reddy fires on Suryapet Jai Bhim Incident ‘జై భీమ్’ ఘటనపై రేవంత్ ఫైర్.. ఆటవిక చర్యపై నిలదీత.?

Revanth reddy fires on suryapet jai bhim incident

Jai Bhim incident in Telangana, Jai Bhim Incident in Suryapet, Jai Bhim incident in Atmakur Mandal, Jai Bhim Incident in yepuru, Daravath Veera Shekar, Ramoji Thanda, robbery case, mariyamma, lock-up death case, High court, Ramoji Thanda, Suryapet, Telangana, Crime

Telanagana Pradesh Congress Presiident Revanth Reddy fires on Telangana government over the Jai Bhim Incident occured in Suryapet district. He questions is this the Friendly police the government heads are telling about. This the way the human rights are ruined in Telangana.

కేసీఆర్ సర్కార్ పై రేవంత్ ఫైర్.. ఇదేం అటవిక రాజ్యమని ప్రశ్న.?

Posted: 11/12/2021 01:02 PM IST
Revanth reddy fires on suryapet jai bhim incident

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ దేశవ్యాప్తంగా జైభీమ్ సినిమా హాట్ టాపిక్ గా మారింది. అనగారిన వర్గాలను పోలీసులు ఏ విధంగా తమకు పరిష్కారం లభించని కేసులో దోషులుగా చేరుస్తారో ఈ చిత్రం కళ్లకు కట్టినట్టు చూపుతోంది. వారు నేరాన్ని అంగీకరించేలా ఎలాంటి టార్చర్ పెడతారో కూడా ఈ సినిమాలో చూపించారు‌. అన్యాయంగా కేసులు పెట్టి జైల్లో వేసి పోలీసులు పెట్టే చిత్రహింసలు భరించలేక కొందరు అమాయకులు నేరాలను అంగీకరిస్తుండగా, మరికోందరు మాత్రం పరువు ప్రతీష్టలకు పోయి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఏళ్లు గడుస్తున్నా ఇలాంటి కేసులు ఎక్కడో ఒకచోట బయటపడుతూనే ఉన్నాయి.

తాజాగా సూర్యాపేట జిల్లా రామోజీ తండాలో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. ఆత్మకూరు మండలం ఏపూరులో నాలుగురోజుల క్రితం ఓ చోరీ జరిగింది. పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించగా.. నవీన్ అనే వ్యక్తి కనిపించాడు. అతడ్ని అదుపులోకి తీసుకుని తమదైన స్టయిల్‌ లో విచారించి మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. అందరినీ బాగా కొట్టినట్లు వార్తలొస్తున్నాయి. అయితే వారిలో ఓ రైతు ఉన్నాడు. అతడే ధరావత్ వీరశేఖర్. పోలీసుల దెబ్బలకు స్పృహ తప్పి పడిపోయాడు. అతడి పరిస్థితి చూసిన తండా వాసులంతా స్టేషన్ ముందు ధర్నాకు దిగారు.

తాను ఏ తప్పు చేశానో చెప్పకుండా తీసుకెళ్లారని.. బాగా కొట్టారని.. ఎందుకు కొడుతున్నారో కూడా చెప్పలేదని వాపోయాడు వీరశేఖర్‌. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ విచారణకు ఆదేశించారు. డీఎస్పీని విచారణ అధికారిగా నియమించారు. నివేదిక అందిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా ఈ ఘటనపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందిస్తూ రాష్ట్రంలోని కేసీఆర్ సర్కార్ ను టార్గెట్ చేశారు. రాష్ట్రంలోని పెండ్రీ పోలిస్ విధానం ఏర్పాటు చేశామని గొప్పులు చెప్పుకునే ప్రభుత్వం.. ఆ ఫ్రెండ్లీ విధానం ఎవరికి సోంతమని ప్రశ్నించారు.

ఈ క్రమంలో ‘‘టీఆర్ఎస్ నికృష్టపు పాలనలో మానవహక్కులు ఉరికొయ్యకు వేలాడుతున్నాయి. నిన్న మరియమ్మ, శీలం రంగయ్యల ప్రాణాలను ఖాకీలు తోడేశారు. ఇదేం దారుణం అని హైకోర్టు కన్నెర్ర చేస్తున్న సమయంలోనే వీరశేఖర్ పై అన్యాయంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. కేసీఆర్ ఇది ప్రజాస్వామ్యమా… ఆటవిక రాజ్యమా..?’’ అంటూ ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పోస్టు చేశారు. రేవంత్ పోస్టుపై నెటిజనుల నుంచి కూడా అనూహ్య స్పందన లభిస్తోంది. పోలీసులు కూడా గులాబి నేతలతో ఒకలా, సామాన్యులతో మరోలా వ్యవహరిస్తున్నారని కామెంట్లు పెడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles