ఎన్సీపీ అధికార ప్రతినిధి, మహారాష్ట్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి నవాబ్ మాలిక్ మరో మారు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులకు సూచనలు చేస్తూనే వారిపై విరుచుకుపడ్డారు. దేశంలో డ్రగ్స్ వ్యాపారం గుజరాత్ కేంద్రంగా జరుగుతోందా? అని ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. తాజాగా గుజరాత్‌లోని ద్వారకలో రూ. 313.64 కోట్ల విలువైన డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్న ఘటనను ప్రస్తావిస్తూ ఆయన ఎన్సీబి అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు.
ఇక మహారాష్ట్రంలోని ముంద్రా పోర్టులో కూడా కొన్నిరోజుల క్రితం 3వేల కేజీల డ్రగ్స్ దొరికాయి. ఈ ఘటనలను గుర్తుచేసిన నవాబ్ మాలిక్.. ఈ రెండు కేసులు యాదృచ్ఛికమేనా? లేక సముద్ర మార్గం ద్వారా దేశంలోకి డ్రగ్స్ ప్రవేశించడంలో గుజరాత్ ఒక హబ్‌గా మారిందా? అని ప్రశ్నించారు. ఈ విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఎన్సీబీ దర్యాప్తు చేపట్టాలని సూచించారు. ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసుతో సంబంధాలున్న మనీష్ భానుశాలి, ధవల్ భానుశాలి, కిరణ్ గోసావి, సునీల్ పాటిల్ తరచూ అహ్మదాబాద్‌కు చాలాసార్లు వెళ్లారని ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు.
అక్కడి వీరందరూ ఫైవ్‌స్టార్ హోటళ్లలో బస చేసేవారని నవాబ్ మాలిక్ చెప్పారు. వీరందరికీ గుజరాత్ మంత్రి కృతిసింహ్ రాణాతో సత్సంబంధాలున్నాయని, వీళ్లంతా డ్రగ్స్ గేమ్‌లో పాలుపంచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. పబ్లిసిటీ కోసం బాలీవుడ్ యాక్టర్ల దగ్గర లభించే కొన్ని గ్రాముల డ్రగ్స్‌ను పట్టుకొని, ముంబై డ్రగ్స్ అడ్డాగా మారిందనే అపోహలు సృష్టించడం మానుకోవాలని ఎన్సీబీకి చురకలంటించారు. ఈ గ్రాముల కేసులు కాకుండా కేజీలకొద్దీ డ్రగ్స్ దొరికే కేసులను సీరియస్‌గా తీసుకోవాలని సలహా ఇచ్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more