ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియాకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో తెలిసిందే. నిరుద్యోగ యువత మొదలుకుని కంపెనీ సీఈఓల వరకు అందరూ తమ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా నిత్యం యాక్టివ్ గా వుంటారు. కొందరు తమ సంస్థ ఉత్పత్తులపై ఇక్కడ క్లారిటీ ఇస్తూ.. నూతన ఉత్పదకతలను కూడా పరిచయం చేస్తుంటారు. అయితే మరికొందరు మాత్రం ఇతరలు పంపిన సందేశాలలో మునిగితేలుతుంటారు. వారి పోస్టులకు కామెంట్లు పెడుతూ.. స్నేహితులతో కలసి ముచ్చటించేందుకు సమయాన్ని వెచ్చిస్తుంటారు. అయితే ఇది ఉద్యోగులు, సీనియర్ ఉద్యోగుల వరకు మాత్రమే పరిమితం కాలేదు.
మేనేజ్ మెంట్ స్థాయిలోని వ్యక్తులతో పాటు కంపెనీ సీఈఓ స్థాయివరకు అందరినీ సోషల్ మీడియా ప్రభావితం చేసిందనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఫేస్ బుక్ లో గడిపే సమయాన్ని తగ్గించుకునేందుకు ఓ కంపెనీ సీఈవో చేసిన పని అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పాల్వొక్ సంస్థ సీఈవో మనీష్ సేథి తాను ఫేస్బుక్ ఓపెన్ చేసినప్పుడల్లా కొట్టడానికి ఓ మహిళను ఉద్యోగంలో పెట్టుకున్నాడు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఫేస్బుక్ చూడకుండా ఉండాలనే ఉద్దేశంతో క్రాగ్ లిస్ట్ అనే ఎంప్లాయిమెంట్ వెబ్ సైట్లో గంటలకు 8 డాలర్లు వేతనాన్ని అందించనున్నట్లు ప్రకటించాడు. అంతే ఆ యాడ్ చూసిన కారా అనే మహిళ వచ్చి ఆ ఉద్యోగంలో చేరింది. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.600 అన్నమాట.
ఈ ప్రక్రియ వల్ల తనకు చాలా సమయం మిగులుతోందని అంటున్నాడు మనీష్. ఈ కారాను నియమించుకోవడం కారణంగా తాను పూర్తి సమయాన్ని తన సంస్థపై, తన విధులపై కేటాయించగలుగుతున్నానని చెప్పుకోచ్చాడు. దీంతో తన కంపెనీ ఉత్పాదకతను ఏకంగా 98 శాతం తీసుకెళ్లగలిగే స్థాయికి చేరుకున్నానని గర్వగా చెప్పుకోచ్చాడు. సమయాన్ని వ్యాపారంపై దృష్టి పెడుతున్నానని చెబుతున్నాడు. అయితే ఈ విషయం తెలిసి టెస్లా, స్పెస్ ఎక్స్ సంస్థ అధినేత ఎలన్ మస్క్ కాస్త ఫన్నీగా స్పందించాడు. రెండు ఫైర్ ఎమోజీలను పోస్ట్ చేశాడు. దీనిపై స్పందించిన మనీష్.. ఫైర్ గుర్తులకు అర్థం ఏంటో కాలమే నిర్ణయిస్తుందని ట్వీట్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more