CM embarrassed after teachers say paid bribes for transfers ‘‘ఔను లంచాలు ఇచ్చాం’’ ముఖ్యమంత్రికి టీచర్ల దిమ్మదిరిగే షాక్..

Rajasthan cm ashok gehlot embarrassed after teachers say yes they pay bribes for transfers

Ashok Gehlot, Rajasthan education, Rajasthan schools, Govind Singh Dotasra, Rajasthan Minister for School Education, Congress, Rajasthan,Ashok Gehlot, Rajasthan education, rajasthan schools, Govind Singh Dotasra, crime

Rajasthan Chief Minister Ashok Gehlot faced an embarassing situation when teachers at a state-level award ceremony in Jaipur responded with a "yes" to a question about the prevalence of bribery in transfers pertaining to the education department.

ITEMVIDEOS: ‘‘ఔను లంచాలు ఇచ్చాం’’ ముఖ్యమంత్రికి టీచర్ల దిమ్మదిరిగే షాక్..

Posted: 11/17/2021 04:36 PM IST
Rajasthan cm ashok gehlot embarrassed after teachers say yes they pay bribes for transfers

తన పాలనలో ప్రజలు ఎలా ఉన్నారు.? వారి సమస్యలు ఏంటీ.. పాలన గురించి వారు ఏమనుకుంటున్నారు.? ప్రజాభిప్రాయాన్ని రహస్యంగా తెలుసుకునేందుకు శతాబ్దాల క్రితం రాజుల కాలంలో వారు మారువేషాల్లో ప్రజల మధ్యకు వెళ్లి తెలుసుకునేవారని తెలుసుకున్నాం. కానీ ఇప్పటి పరిస్థితులు పూర్తిగా భిన్నం. ప్రజలు ఎలా వున్నారని కాకుండా తమ హయాంలో ఇది చేశం. అది చేశామంటూ ప్రభుత్వాలే నేరుగా చెప్పేస్తున్నాయి. అది ఎంతవరకు అములు జరిగినా.. జరగకపోయినా ఫలానా చేశామన్న భ్రమలను మాత్రం కలిగించేస్తాయి.

మరో ఐదేళ్ల కాలం పాటు ప్రజలు తమకే అధికారం అందించేందుకు చేయనివి కూడా చేశామని చెప్పుకోవడం ఇప్పటి పాలకులకు పరిపాటిగా మారింది. ఇక రాజు ఒకలా తలిస్తే.. అమాత్యులు మరోలా తలిచారని.. లేక ఎమ్మెల్యేలు మరోలా చేస్తున్నారని అరోపణలు కూడా వినిపిస్తుంటాయి. ఇలాంటి అరోపణలు నేరుగా ముఖ్యమంత్రి పాల్గోన్న సభలోనే వినిపిస్తే.. ఆయనకు దిమ్మదిరిగే షాక్ తగిలినట్టే. ఇలాంటి ఘటనే రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ కు ఎదురైంది. ఉపాధ్యాయులు నిండుగా వున్న సభలో ఆయన ప్రసంగిస్తూ గతంలో ఉపాధ్యాయులు తమ బదిలీల కోసం తప్పక చేతులు తడపాల్సి వచ్చేదని.. కానీ ఇప్పుడా పరిస్థితి లేదని అన్నారు.

అయితే సభలో ఉన్న ఉపాధ్యాయులు ఇప్పుడు కూడా ఇచ్చాం అన్నారు. వెంటనే బదీల కోసమా.. అనగా ఔను బదిలీల కోసం లంచాలు ఇచ్చాం.. ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకున్నామని బదులు రావడంతో ఆయన ఊహించని ఇబ్బందికర పరిణామం ఎదుర్కోవాల్సి వచ్చింది. బదిలీలు, కొత్తగా పోస్టుల కోసం తాము స్థానిక ఎమ్మెల్యేలతో పైరవీలు చేయించుకుని, డబ్బులు ముట్టజెప్పాల్సి వస్తోందంటూ పలువురు టీచర్లు ఆరోపించారు. టీచర్ల ఆరోపణలు.. కొంత సమయం సీఎం గహ్లోత్ నోట మాటరాకుండా చేసింది. అయితే అనుభవజ్ఞుడైన గెహ్లోత్ పరిస్థితిని తిరిగి తన వైపు అకర్షించుకునేలా ప్రకటన చేశారు.

దీంతో నిశ్చేష్టుడైన గహ్లోత్‌.. బదిలీల కోసం ఉపాధ్యాయులు ముడుపుల చెల్లించామంటూ వచ్చిన ఆరోపణలపై విచారణ జరుపుతామంటూ హామీ ఇచ్చారు. ‘బదిలీల కోసం ఉపాధ్యాయులు లంచాలు ఇవ్వాల్సి రావడం దురదృష్టకరమని అన్నారు. అయితే ఇకపై ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా త్వరలో ఒక పారదర్శకతతో కూడిన విధానాన్ని ప్రకటిస్తామని ప్రకటించారు. భవిష్యత్తులో బదిలీల కోసం ఏ ఉపాద్యాయుడు తమ జేబులోంచి నయాపైసా ఖర్చుపెట్టాల్సి రాకుండా ఈ విధానం చేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆ వెంటనే రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి గోవింద్‌ సింగ్ దోతస్రా కూడా ముఖ్యమంత్రి నేతృత్వంలో ఆ విధానాన్ని త్వరగా తీసుకువచ్చేందుకు తాను పూనుకుంటానని ప్రకటించారు. ఈ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles