జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్ కౌంటర్లో భారత భద్రతా బలగాలు ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. దక్షిణ కశ్మీర్లోని కుల్గాం జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఏడాది ఏకంగా 117 మందిని యువకులను ముష్కరమూకలు ఉగ్రవాదులు నియమించుకున్నాయి. ఈ వార్త ఓ వైపు కాశ్మీర్ వాసుల్లో అందోళన రేకెత్తిస్తున్న తరుణంలో భారత బద్రతా బలగాలు కూడా అప్రమత్తమయ్యాయి. కాశ్మీర్లో ఎక్కడికక్కడ అన్ని ప్రాంతాలను జల్లెడ పడుతూ ఉగ్రవాదలను మట్టుబెడుతున్నాయి.
ఈ క్రమంలో దక్షిణ కాశ్మీర్ లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాద మూకలు తలదాచుకున్నాయన్న రహస్య సమాచారంతో కార్డిన్ సర్చె అపరేషన్ చేపట్టిన భద్రతా బలగాలపై అక్కడున్న ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు కూడా ప్రతిగా కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఉగ్రవాదులు మరణించారు. కాగా మృతుల్లో ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) కమాండర్ అఫాక్ సికందర్ ఉన్నట్టుగా పోలీసులు తెలిపారు. కుల్గాం జిల్లా పాంబే, గోపాల్పొరాలో ప్రాంతాల్లో రెండు వేర్వేరు ఎన్ కౌంటర్లు జరిగాయి, ఈ ఎన్ కౌంటర్లో మొత్తం ఐదుగురు ముష్కరులు మరణించారు.
గోపాల్పొరాలో రెసిస్టెంట్ ప్రంట్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు భద్రతా సిబ్బంది ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఉగ్రవాదుల కోసం గాలిస్తుండగా వారు భద్రతా అధికారులపై కాల్పులు జరిపారని, ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని కశ్మీర్ ఐజీ విజయ్ ట్వీట్ చేశారు. వారిలో ఒకరు నిషేధిత టీఆర్ఎఫ్కు చెందిన కమాండర్ సికందర్గా గుర్తించినట్టు పేర్కొన్నారు. కాగా గత ఏడాది డిసెంబర్ నుంచి ఈయన ఉగ్రకార్యకలాపాల్లో యాక్టివ్ గా వున్నాడని పోలీసులు తెలిపారు.
కాగా మరోకరిని సాద్ చెక్ అవెనీరా ప్రాంతానికి చెందిన రెసిస్టెంట్ ఉగ్రసంస్థకు చెందిన ఇరాక్ ముష్రాఖ్ గా గుర్తించారు. ఇతరు గత ఏడాది జూన్ నుంచి ఉగ్రకార్యకలాపాల్లో యాక్టివ్ గా వున్నాడని పోలీసులు తెలిపారు. ఇక పాంబే ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లోనూ ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో ఇకరిని షకీర్ నజర్, సుమైర్ నజర్ లుగా గుర్తించారు. ఇక మరోకరిని పోలీసులు గుర్తించాల్సి వుంది. కాగా ఉగ్రవాదలు తలదాచుకున్న ఆయా ప్రాంతాల్లో అర్మీ బలగాలతో పాటు కాశ్మీర్ పోలీసు బలగాలు సంయుక్తంగా కార్డన్ సర్చ్ చేస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more