'Can spoil our youth': PM Modi on cryptocurrency క్రిప్టోకరెన్సీ: దారితప్పితే యువత భవిష్యత్ గల్లంతేనన్న ప్రధాని

Pm modi urges democratic nations to work together on cryptocurrency

pm modi, cryptocurrency, The Sydney Dialogue, bitcoin, block chain technology, Narendra Modi, Spoil Youth, change of time, technology, data, weapons

All democratic nations must work together to ensure cryptocurrency "does not end up in wrong hands, which can spoil our youth," Prime Minister Narendra Modi said on Thursday, in his first public comments on the subject.

ప్రజాస్వామ్య దేశాలన్నీ ఐక్యంగా పనిచేయాలి: క్రిప్టోకరెన్సీపై ప్రధాని మోడీ

Posted: 11/18/2021 01:32 PM IST
Pm modi urges democratic nations to work together on cryptocurrency

ప్ర‌పంచ‌వ్యాప్తంగా క్రిప్టోక‌రెన్సీ చెలామ‌ణిలోకి వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఇప్పటికే ఈ కరెన్సీని చాలా దేశాల్లో చెలామణి అవుతోంది. ప్ర‌ధాని నరేంద్రమోదీ తొలిసారి ఆ అంశంపై త‌న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. చెడ్డ‌వారి చేతుల్లోకి క్రిప్టో క‌రెన్సీ వెళ్తే వాటిని వినియోగిస్తున్న యువత భవిష్యత్ గంధరగోళంగా తయారవుతోందని అన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తకుండా ప్ర‌పంచంలోని అన్ని ప్ర‌జాస్వామ్య దేశాలు క‌లిసి ఓ నిర్ణ‌యం తీసుకోవాల‌న్నారు. డిజిట‌ల్ క‌రెన్సీపై ఇండియా ఇంకా ఎటువంటి నిర్ణ‌యాన్ని తీసుకోలేదు. కానీ క్రిప్టో వ‌ల్ల యువ‌త చెడిపోయే ప్ర‌మాదం ఉంద‌ని మోదీ అభిప్రాయ‌ప‌డ్డారు.

ద సిడ్నీ డ‌య‌లాగ్ స‌ద‌స్సులో పాల్గొన్న ఆయ‌న ఈ మేరకు క్రిప్టోకరెన్సీపై కీల‌క ఉప‌న్యాసం చేశారు. భార‌త్‌లో క్రిప్టోపై ఎలా ముందుకు వెళ్లాల‌ని ఇటీవ‌ల మోదీ.. బ్యాంకింగ్ అధికారుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న వార్నింగ్ సందేశం ఇచ్చారు. మ‌నీల్యాండ‌రింగ్‌కు, టెర్ర‌ర్ ఫైనాన్సింగ్‌కు క్రిప్టోమార్కెట్ల‌కు వేదిక‌గా మారుతున్న‌ట్లు ప్ర‌ధాని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ప్రస్తుతం ప్రపంచం కాలానుగూణంగా మారుతోందని అన్నారు. అయితే ఈ మార్పుల నేపథ్యంలో శాస్త్రసాంకేతికతలు కొత్తపుంతలు తొక్కుతున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో టెక్నాల‌జీ, డేటాలు ఇప్పుడు కొత్త ఆయుధాలుగా మారుతున్నాయ‌ని, అందుకే డేటా గ‌వ‌ర్నెన్స్‌లో ప్ర‌జాస్వామ్య దేశాలు పరస్పరం స‌హ‌క‌ారం అందించుకోవాల‌న్నారు.

క్రిప్టోక‌రెన్సీ లేడా బిట్‌కాయిన్ గురించి ప్ర‌స్తావిస్తే, అన్ని ప్ర‌జాస్వామ్య దేశాలు ఈ అంశంపై క‌లిసి ప‌నిచేయాల‌ని, క్రిప్టోలు చెడ్డ‌వారి చేతుల్లోకి వెళ్ల‌కుండా చూడాల‌ని, ఎందుకుంటే అది మ‌న యువ‌త‌ను నాశ‌నం చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు మోదీ హెచ్చ‌రించారు. క్రిప్టో పెట్టుబ‌డుల విష‌యంలో భార‌త ప్ర‌భుత్వం మార్గ‌ద‌ర్శ‌కాల‌ను రూపొందిస్తున్న‌ట్లు తెలుస్తోంది. డిజిట‌ల్ యుగం మ‌నం చుట్టు ఉన్న అన్నింటినీ మార్చేస్తోంద‌ని, రాజ‌కీయాలు, ఆర్థిక వ్య‌వ‌స్థ‌, స‌మాజం అన్ని మారిపోయిన‌ట్లు మోదీ తెలిపారు. సౌభ్రాతృత్వం, ప‌రిపాల‌న‌, నీతి, చ‌ట్టాలు, హ‌క్కులు, భ‌ద్ర‌త అన్నింటిపై డిజిట‌ల్ ప్ర‌భావం ప‌డిన‌ట్లు ప్ర‌ధాని తెలిపారు. డిజిట‌లైజేష‌న్‌తో అంత‌ర్జాతీయ పోటీతత్వంలోనూ మార్పు వ‌చ్చింద‌న్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : block chain technology  crypto currency  Pm Modi  The Sydney Dialogue  Bitcoin  

Other Articles