Former CM Mukul Sangma, 11 other MLAs join TMC కాంగ్రెస్ పార్టీకి జలక్.. టీఎంసీలోకి 12 మంది ఎమ్మెల్యేలు

Meghalaya in massive jolt to congress 12 out of 17 mlas join tmc

Meghalaya Chief Minister Mukul Sangma, Meghalaya Chief Minister Mukul Sangma NEWS, Mukul Sangma TMC, Mukul Sangma NEWS TMC JOIN, Mukul Sangma joins tmc, meghalaya congress MLAs join TMC, Meghalaya congress MLAs TMC, Meghalaya, Politics

In a massive jolt to Congress, former Meghalaya Chief Minister Mukul Sangma and 11 others join Trinamool Congress in Meghalaya. With this move, 12 out of 17 Congress MLAs joined Trinamool. This comes a month after Rahul Gandhi met former Meghalaya Chief Minister Mukul Sangma and the party's state president Vincent H Pala over their demands.

కాంగ్రెస్ పార్టీకి జలక్.. టీఎంసీలో చేరిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

Posted: 11/25/2021 01:17 PM IST
Meghalaya in massive jolt to congress 12 out of 17 mlas join tmc

జాతీయ పార్టీగా గత కొన్ని దశాబ్దాలుగా బాసిల్లుతున్న కాంగ్రెస్ పార్టీకి వరుసపెట్టి షాకులు తగులుతున్నాయి. గత రెండున్నరేళ్లుగా పార్టీకి పూర్తిస్థాయి అధ్యక్షుడి లేని లోటు కొట్టోచ్చినట్టు కనబడుతోంది. జాతీయ పార్టీ తన ఉనికికే ప్రమాదం తెచ్చుకునే స్థాయికి దిగజారిపోతోంది. ఒక్కో రాష్ట్రంలో తనకున్న పట్టును జారవిడుచుకుంటూ.. ఇతర పార్టీలకు బలాన్ని తెచ్చిపెడుతోంది. తాజాగా మేఘాలయలోనూ కాంగ్రెస్ పార్టీ నేతలు పార్టీ అదిష్టానానికి తేరుకోలేని షాకిచ్చారు. మూకుమ్మడిగా కలసి టీఎంసీలోకి చేరి ఉనికి లేని పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా చేశారు.

రాష్ట్రంలో పార్టీకి ఉన్న 17 మంది ఎమ్మెల్యేలలో 12 మంది టీఎంసీలో చేరారు. వీరిలో మాజీ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా కూడా ఉండడం గమనార్హం. మేఘాలయ అసెంబ్లీలో మొత్తం 60 సీట్లు ఉండగా, 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 21 స్థానాల్లో విజయం సాధించింది. ప్రస్తుతం ఆ పార్టీకి 17 మంది ఎమ్మెల్యేలు మిగలగా, 12 మంది ఎమ్మెల్యేలు రాత్రికి రాత్రే టీఎంసీలో చేరడంతో అసెంబ్లీలో ఆ పార్టీ ప్రతిపక్షంగా అవతరించింది. కాంగ్రెస్ తీరుపై ముకుల్ సంగ్మా గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ కారణంగానే ఆయన  ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

టీఎంసీలోకి ఇటీవల వలసలు బాగా పెరిగాయి. వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ బలోపేతంపై దృష్టిసారించిన మమత.. ఇతర రాష్ట్రాల్లోనూ పాగా వేయాలని భావిస్తున్నారు. గోవా మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర కాంగ్రెస్ బలమైన నేతగా గుర్తింపు తెచ్చుకున్న లుజినో ఫలైరో సెప్టెంబరులో టీఎంసీలో చేరారు. టెన్నిస్ డబుల్స్ మాజీ స్టార్ లియాండర్ పేస్, మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్, రాహుల్ గాంధీతో ఒక్కప్పుడు సన్నిహితంగా మెలిగిన అశోక్ తన్వర్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు ఇటీవల టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles