తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నివాసం వేద నిలయానికి సంబంధించి మద్రాసు హైకోర్టు గత నెల 24న సంచలన తీర్పు వెలువరించిన నేపద్యంలో ఇవాళ అమె మేనకోడలు దీపా, తన సోదరుడు దీపక్ తో కలసి అడుగుపెట్టారు. చెన్నై నగరంలోని అత్యంత ఖరీదైన పోయెస్ గార్డెన్ లో జయలలిత నివాసం ఉన్న విషయం తెలిసిందే. ఈ వేద నిలయం భవనాన్ని అమె మేనకోడలు, మేనల్లుడు దీపక్ లకు అందజేయాలని మద్రాసు హైకర్టు అదేశాల ప్రకారం చెన్నై జిల్లా కలెక్టర్ విజయ రాణి వారికి అందజేశారు. అయితే ఈ భవనాన్ని జయలలిత స్మారక మందిరంగా మార్చాలని గత అన్నాడిఎంకే ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను న్యాయస్థానం తిరస్కరించిరంది.
జయలలిత ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వానికి ఎలాంటి హక్కులేదని స్పష్టం చేసిన కోర్టు.. మూడు వారాల్లో పోయెస్ గార్డెన్ ని జయలలిత మేన కోడలి దీప, మేనల్లుడు దీపక్ లకు అప్పగించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో కలెక్టర్ జె విజయరాణి దీపా, దీపక్ లకు పోయిస్ గార్డెన్ తాళం చెవిలను అందించారు. ఈ క్రమంలో మంచి ముహూర్తాన్ని చూసుకున్న దీపా తన సోదరుడు దీపక్ తో కలసి పోయిస్ గార్గెన్ ఆవరణలోని వేదనిలయంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా అమె తన మేనత్తను స్మరించుకున్నారు. దాదాపు నాలుగు గంటల పాటు వేద నిలయంలో అమె ఉన్నారు.
ఈ సందర్భంగా అమె మీడియాతో మాట్లాడుతూ.. దాదాపు 12 సంవత్సరాల క్రితం తాను చివరిసారి సందర్శించినప్పటి నుండి ఇల్లు మారిపోయిందని ఉద్వేగానికి లోనయ్యారు. “మొదటిసారి, తన మేనత్త.. స్వర్గీయ జయలలిత లేకుండా ఇంట్లోకి ప్రవేశిస్తున్నాను. ఇది నిజంగా బాధగా ఉంది, ”అని అన్నారు. తన అత్తకు ఇంటీరియర్ డిజైన్లో మంచి అభిరుచి ఉందని తనకు తెలుసని, ప్రస్తుతం ఇల్లు సౌందర్య రూపాన్ని కోల్పోయిందని దీపా అన్నారు. జయలలిత గది పరిమాణం తగ్గిపోయినట్లు అనిపించింది. "మా అత్త ఇంత చిన్న ఇంట్లో ఎలా నివసిస్తుందో నేను ఆశ్చర్యపోయాను, నివసించడానికి సరిపోని గదిలో అమె ఎలా ఉందో.?" అని ఆమె అన్నారు.
“మా భావాలను వ్యక్తపరచడంలో పదాలు విఫలమవుతాయి. ఇలాంటి టర్నింగ్ పాయింట్ వస్తుందని మేం ఊహించలేదు. మా అత్తగారి ఆత్మకు ఇప్పుడు శాంతి కలుగుతుంది. నేను ఇంట్లోకి అడుగు పెట్టకూడదు అన్న గొంతులు వినిపించాయి. ఇప్పుడు అది మా హక్కుగా మాకు లభించింది. దానికి మా మేనత్త ఆశీస్సులే కారణం’’ అని దీప అన్నారు. ఆమె ఇంకా మాట్లాడుతూ, తన చిన్నతనంలో ఎక్కువ భాగం ఇక్కడే గడిపిన ఇంటి గురించి చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. “కానీ మా అత్త ఫోటోలు చాలా లేవు. ఆమె పెంపుడు జంతువుల ఫోటోలు కూడా లేవు, ”అని దీపా అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more