టాలీవుడ్ హీరోలతో పాటు సినీప్రముఖులు, రియల్టర్లను, అధికవడ్డీ ఆశతో బోల్తా కొట్టించి.. రూ.కోట్ల మేర డబ్బును వసూలు చేసిన కిలాడీ లేడి శిల్పా చౌదరీ అవినీతి విన్యాసాల జాబితాలో చిక్కున్న అనేక మంది ఇప్పటికీ ఇంకా బయటకు రాలేకపోతున్నారు. అందుకు కారణంగా అమె వారి నుంచి వసూలు చేసిన మొత్తం బ్లాక్ మనీ కావడమేనని తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు అమెపై ముగ్గురు అధికారికంగా నార్సింగి పోలీసులకు పిర్యాదు చేసిన విషయం తెలిసింది. ఇందులో సూపర్ స్టార్ మహేశ్ బాబు సోదరి ప్రియదర్శిని.. సహా టాలీవుడ్ యంగ్ హీరో హర్ష్ కూడా నిట్టనిలువునా మోసపోయాడు.
శిల్పా చౌదరి మాయమాటలు నమ్మి ప్రియదర్శిని రూ.2 కోట్లను అమెకు ఇవ్వగా.. యంగ్ హీరో హర్ష్ కనుమల్లి ఏకంగా రూ. 3 కోట్లు నష్టపోయానని ఫిర్యాదులో పేర్కొన్న విషయం తెలిసిందే. ఇక వీరితో పాటు శిల్పా చౌదరిపై తొలిసారిగా పిర్యాదు చేసిన దివ్యారెడ్డి, రేణుకారెడ్డీలకు కూడా కోట్ల రూపాయల మేర శఠగోపం పెట్టిన విషయం తెలిసింది. అయితే వీరి పిర్యాదుల ఆదారంగా అమెను తమ కస్టడీలోకి తీసుకున్న పోలీసులు మూడు రోజుల పాటు విచారించారు. దీంతో పోలీసుల విచారణలో అమె తనపై పోలీసులకు పిర్యాదు చేసిన ముగ్గురికి వారి డబ్బును తిరిగి చెల్లిస్తానని అంగీకరించినట్లు సమాచారం.
కాగా, రాధికారెడ్డికి తాను రూ.10 కోట్లకు పైగానే ఇచ్చినట్టు శిల్పాచౌదరి చెప్పినప్పటికీ అందుకు తగిన ఆధారాలు ఇవ్వలేదని తెలుస్తోంది. అమె చేసిన మోసాలపై పోలీసులు మరిన్నీ వివరాలు సేకరిస్తున్నారు. శిల్పా చౌదరి గతంలో అమెరికాలో మూడేళ్లపాటు ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసినట్టు పోలీసులు గుర్తించారు. ఆమె ఖాతాలో రూ. 16 వేలు, భర్త శ్రీనివాస్ ప్రసాద్ ఖాతాలో రూ. 14 వేలు ఉండడం చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. కాగా, మూడు రోజుల పోలీసు కస్టడీ ముగియడంతో పోలీసులు నేడు ఆమెను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
సుమారు 200 కోట్ల వరకు వసూళ్ల పేరుతో కుచ్చు టోపీ పెట్టినట్లు తెలుస్తోంది. ఫేజ్ త్రీ పార్టీ లు ఇచ్చి సెలబ్రిటీలను ఆకర్షించిన శిల్ప.. వారి నుంచి ప్రముఖులను పరిచయాలు చేసుకుని వారి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూళ్లు చేసింది. చాలామంది ప్రముఖుల్ని శిల్ప మోసం చేసినట్లు వార్తలు అందిన విషయం తెలిసిందే. ఆధిక వడ్డి ఇస్తానని చెప్పి శిల్ప కోట్లు వసూలు చేసింది. ల్లధనాన్ని మార్పిస్తానని, అధిక వడ్డీ ఇస్తానని చెప్పి శిల్పి.. ప్రముఖుల్ని మోసం చేసింది. మోసపోయినవారిలో చాలా మంది బాధితులు ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more