US Waitress Gets Fired After Receiving a Rs 3.5 Lakh Tip లక్షల టిప్ అందుకున్న సంతోషం.. అంతలోనూ అవిరి..

Us waitress says she was fired after customers left her rs 3 lakh tip

us, waitress, tip, fired, job, Ryan Brandt, Waitress, Oven and Tap Restaurant, online fundraising, fundraising campaign, viral, story, viral stories, trending stories

According to a report, Ryan Brandt was fired from her job after that. Brandt said the restaurant asked her to share the tip with her co-workers, something she said had never happened in the three-and-a-half years she worked at Oven and Tap. Grant Wise has started an online fundraising campaign to help Ryan Brandt out.

లక్షల టిప్ అందుకున్న సంతోషం.. అంతలోనూ అవిరి..

Posted: 12/15/2021 07:14 PM IST
Us waitress says she was fired after customers left her rs 3 lakh tip

అదృష్టం త‌లుపుతట్టే లోపు.. దుర‌దృష్టం ఇంట్లోకి వచ్చి కూర్చుంటుందని నానుడి. ఈ నానుడే ఈ అమెరిక‌న్ వెయిట్రెస్ విషయంలో నూటికి నూరుపాళ్లు నిజమైంది. తాను చేసిన సర్వీసుకు మెచ్చుకుని కస్టమర్లు ఇచ్చిన టిప్పును ఏకంగా తన ఉద్యోగం ఊడగొట్టింది. దీంతో ఇప్పుడా వెయిట్రెస్ త‌ల‌ప‌ట్టుకుంది. తనకు లభించిన టిప్ ను ఆ రెస్టారెంట్ లోనే లేని విధంగా అందరితో కలసి పంచుకోవాలన్న అదేశాలే అమె ఉద్యోగానికి ఎసరు తెచ్చాయి. ఆర్కాన్సాస్‌లో ఓవెన్ అండ్ ట్యాప్ రెస్టారెంట్‌లో వెయిట్రెస్‌గా ప‌నిచేసే ర్యాన్ బ్రాండ్‌కు కొంద‌రు గెస్ట్‌లు ఏకంగా రూ 3,34,786 టిప్ ఇచ్చారు.

భారీ టిప్ అందుకున్న ఆనందం ఎక్కువ‌సేపు నిల‌వ‌క‌ముందే ఆ టిప్‌ను ఇత‌ర వెయిట‌ర్ల‌తో క‌లిసి పంచుకోవాల‌ని రెస్టారెంట్ కోర‌డంతో ఆమె నిరాక‌రించినందుకు ర్యాన్ త‌న ఉద్యోగం కోల్పొయింది. రెస్టారెంట్‌లో భోజ‌నం చేసిన అనంత‌రం ఓ టేబుల్‌కు చెందిన 40 మంది గెస్ట్‌లు తలా వంద డాల‌ర్ల చొప్పున ర్యాన్‌కు ఏకంగా రూ 3.34 ల‌క్ష‌ల విలువైన 4400 అమెరిక‌న్ డాల‌ర్ల‌ను టిప్‌గా ఇచ్చారు. ర్యాన్ ప‌క్క‌న నిల‌బ‌డి గ్రాంట్ వైజ్ అనే గెస్ట్ స‌ర్వ‌ర్ల‌కు తామందరం ఎలా టిప్‌ను ఇచ్చామ‌నే వివ‌రాలు వెల్ల‌డించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఈ వ్య‌వ‌హారం రెస్టారెంట్ యాజ‌మాన్యానికి చేర‌డంతో ర్యాన్ ఉద్యోగం కోల్పోయింది. ర్యాన్ తన టిప్‌ను రెస్టారెంట్లోని ఇత‌ర సిబ్బంది అందరితో కలసి పంచుకోవాల‌ని రెస్టారెంట్ కోర‌గా ఓవెన్ అండ్ ట్యాప్‌లో గ‌త మూడున్న‌రేండ్లుగా ఇలా ఎన్న‌డూ టిప్‌ను పంచుకోవ‌డం జ‌ర‌గ‌లేద‌ని ర్యాన్ బ‌దులివ్వ‌డంతో త‌నను ఉద్యోగం నుంచి తొల‌గించార‌ని ఆమె చెప్పుకొచ్చింది. ర్యాన్ బ్రాండ్‌కు ఆస‌రాగా నిలిచేందుకు గ్రాంట్ వైజ్ ప్ర‌స్తుతం ఆన్‌లైజ్ ఫండ్‌రైజింగ్ క్యాంపెయిన్ చేప‌ట్టాడు.

 
 
 
View this post on Instagram

A post shared by Rebecca Soto (@rebeccasoto_legacy)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : us  waitress  tip  fired  job  Ryan Brandt  Waitress  Oven and Tap Restaurant  viral stories  trending stories  

Other Articles