నగరంలో అందులోనూ సంపన్న కుటుంబాలు నివాసం ఉండే పాష్ ఏరియా అంటే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ అనే పేర్లు ఠక్కున గుర్తుకు వస్తాయి. ఇలాంటి ప్రాంతాల మీదుగా నగరంలోని పలు ప్రఖ్యాత ప్రాంతాలకు వెళ్తుంటారు హైదరాబాదీయులు. అయితే ఎవరి కోసం ఏర్పాటు చేశారో తెలియదు కానీ.. ఇక్కడ ఉండే కొన్ని పబ్ లు, రెస్టారెంట్లు నిరంతరం కస్టమర్లకు సేవలు అందిస్తూనే వుంటాయి. దీంతో అర్థరాత్రి, అపరాత్రి అన్న తేడా లేకుండా యువత మద్యం మత్తులో జోగుతూనే ఉంటారు. ఇటీవల బంజారాహిల్స్ పరిధిలో విలాసవంతమైన ఫార్షే కారు ఢీకొని ఇద్దరు మరణించిన ఘటనను మరువక ముందే మరో ఘెర ప్రమాదం గత అర్థరాత్రి చోటుచేసుకుంది.
బంజారాహిల్స్ రోడ్ నం.3లో తెల్లవారుజామున కారు బీభత్సం సృష్టించింది. సినీమా తరహాలో కారు గాల్లో పల్టీలు కోట్టి.. రోడ్డుకు అవతలి వైపు పడింది. పడుతూ అటు నుంచి వచ్చే వాహనాన్ని ఢీకొని.. అందులో ప్రయానిస్తున్న సాప్ట్ వేర్ ఇంజనీర్లను భయభ్రాంతులకు గురిచేసింది. మద్యం మత్తులో అదుపు తప్పిన వేగంతో దూసుకురావడం కారణంగానే ఈ ప్రమాదం సంభవించింది. కాగా ఈ రోడ్డు బీభత్సానికి కారకులైన యువకులు ఘటనా స్థలం నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో యువకుల ఐ20 కారుతో పాటు ఎదురుగా వస్తున్న వింగర్ వాహనం కూడా ధ్వంసమైంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంజగుట్ట నాగార్జున సర్కిల్ వైపు నుంచి బంజారాహిల్స్ రోడ్ నం.3 మీదుగా ఐ20 (టీఎస్ 10 ఈపి 1877) కారులో ముగ్గురు యువకులు మద్యం మత్తులో మితిమీరిన వేగంతో దూసుకోచ్చారు. సరిగ్గా అల్మండ్ హౌస్ వద్ద ఓ స్కూటరిస్ట్ను ఢీకొట్టారు. ఈ ధాటికి కారు ఆకాశంలో పల్టీలు కొట్టి డివైడర్ అవతలి వైపు పడింది. అదే సమయంలో బంజారాహిల్స్ మసీదు వైపు నుంచి పంజగుట్ట వైపునకు వెళ్తున్న వింగర్ (టీఎస్ 12 యూసీ 2970) కారును ఢీకొట్టింది. దీంతో రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొట్టడంతో ఐ20 కారుతో పాటు వింగర్ కూడా ముందు భాగం నుజ్జునుజ్జైంది.
వింగర్ వాహనంలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు మహ్మద్ ఆరిఫ్, ప్రణతి, దీక్ష, గ్లోరియా, సాయిలక్ష్మి, తేజస్విరెడ్డి, దుర్గా రాకేష్ ఉండగా, గణేశ్ కారు నడుపుతున్నాడు. వీరంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అవతలి వైపు నుంచి కారు ఆకాశంలో పల్టీలు కొడుతూ ఇవతలి వైపు తాము వెళ్తున్న కారుకు అడ్డుగా వచ్చి ఢీకొట్టిందని దీంతో భయభ్రాంతులకు గురయ్యామని వింగర్ డ్రైవర్ గణేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రమాదానికి కారకులైన ‘నిషా’చరులు అక్కడి నుంచి కారును వదిలేసి ఉడాయించారు. ఈ కారు ఎవరిదనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వీరి కోసం గాలింపు చేపట్టారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more