1971 యుద్ధంలో దాయాధి పాకిస్థాన్ పై జరిగిన యుద్దంలో విజయం సాధించిన గుర్తుగా జరుపుకునే విజయ్ దివస్ 50వ వార్షికోత్సవం రోజున కూడా అందుకు కారణమైన ఇందిరాగాంధీ పేరును ఉచ్చరించరా.? అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విజయ్ దివస్ జరుపుకునేందుకు కారణమైన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ పాత్రను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విస్మరించిందని ఆయన ఆరోపించారు. దేశ ప్రధానిగా తన నాయినమ్మ"దేశం కోసం 32 బుల్లెట్లు" గాయాలు తిన్నారని, అయినా పాకిస్తాన్‌పై విజయ వార్షికోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో ఆమె పేరు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రస్తావించలేదని అన్నారు.
వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా స్థానిక పరేడ్ గ్రౌండ్ లో జరిగిన ఎన్నికల ర్యాలీతో ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ కోసం తన ప్రాణాలను సైతం అర్పించిందని.. దేశసౌబాగ్యం కోసం అమె చివరకు తన రక్తాన్ని కూడా ధారపోసారని తనకు తెలుసునని అన్నారు. బీజేపి నేతలు అమె పేరును ఉచ్చరించనంత మాత్రాన ఎలాంటి తేడా ఉండదని అన్నారు. అయితే 1971లో జరిగిన యుద్దంలో విజయం లభించిన గోప్పదనం కేవలం అర్మీకో, నేవికో, లేక అప్పటి రాజకీయ నేతలదో కాదని అన్నారు. ఆ విజయం వెనుక కులమతాలకు అతీతంగా సంఘటిత గళంగా ఏర్పడిన దేశప్రజలదని అన్నారు.
1971 యుద్ధంలో పాకిస్థాన్‌పై పోరాటాన్ని బలోపేతం చేసేందుకు లక్షల కుటుంబాలు నాటి ప్రభుత్వానికి బంగారం విరాళంగా ఇచ్చాయని తెలిపారు. అధునాతన యుద్ద విమానాలు, హెలికాప్టర్లు, యుద్దసామాగ్రి దేశాన్ని బలోపేతం చేయవని కాంగ్రెస్ నేత అన్నారు. ప్రజలు బలంగా ఉన్నప్పుడే దేశం బలపడుతుందని ఆయన అన్నారు. దేశం కోసం సరిహద్దుల్లో పోరాడి ప్రాణాలను అర్పించిన వేలాది మంది వీరజవాన్లు మరణించిన రాష్ట్రంతో తనకున్న సంబంధాన్ని త్యాగం నిర్వచించిందని ఆయన అన్నారు. ఉత్తరాఖండ్‌లోని వేలాది కుటుంబాలు దేశ గౌరవం కోసం పోరాడుతున్న వారి బంధువులను కోల్పోయిన విధంగా, తన కుటుంబం కూడా త్యాగాలు చేసిందని.. అదే తనకు ఈ రాష్ట్రంతో ఉన్న బంధమని రాహుల్ అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more