Delhi Police makes an arrest in Rohini Court blast case బాంబు పేలుడు ఘటనలో డీఆర్డీవో శాస్త్ర‌వేత్త అరెస్టు

Delhi police arrests drdo scientist in rohini court blast case says wanted to kill lawyer

rohini court blast, rohini court blast case, drdo, drdo scientist, rohini court bomb blast, Delhi Police, Rohini Court, drdo scientist arrest, Delhi, Crime

Days after a low-intensity blast went off inside the Rohini district court, Delhi Police’s Special Cell on Saturday arrested a scientist for allegedly planting a tiffin bomb to kill a lawyer who was supposed to attend a court hearing there. On December 9, a low-intensity explosion took place at Rohini district court. A police personnel was injured in the incident.

కోర్టులో బాంబు పేలుడు.. డీఆర్డీవో శాస్త్ర‌వేత్త అరెస్టు

Posted: 12/18/2021 04:27 PM IST
Delhi police arrests drdo scientist in rohini court blast case says wanted to kill lawyer

ఢిల్లీలోని రోహిణి కోర్టులో ఇటీవల బాంబు పేలుడు సంభవించిన కేసులో నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న స్పెష‌ల్ సెల్ పోలీసులు ఈ కేసులో ఓ డీఆర్డీవో శాస్త్ర‌వేత్తను అరెస్టు చేశారు. ప్ర‌త్య‌ర్థి లాయ‌ర్ తో గొడ‌వ ఉన్న నేప‌థ్యంలో ఆ శాస్త్ర‌వేత్త పేలుడు కుట్ర‌కు పాల్ప‌డిన‌ట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. డిసెంబ‌ర్ 9వ తేదీన రోహిణి జిల్లా కోర్టులోని రూమ్ నెంబ‌ర్ 102లో త‌క్కువ స్థాయి తీవ్ర‌త‌తో పేలుడు జ‌రిగింది. అయితే ఈ కేసులో అరెస్టు చేసిన వ్య‌క్తి డీఆర్డీవో శాస్త్ర‌వేత్త అని పోలీసులు తెలిపారు.

పోలీసుల విచారణలో లాయర్ ను హత్య చేయాలనే ఉద్దేశంతో తానే పేలుడు పదార్థాలను తయారు చేశానని డీఆర్డీవో శాస్త్రవేత్త ఒప్పుకున్నాడు. సీసీటీవీ ఫుటేజీలు, ఇతర నమూనాలను పరిశీలించిన తర్వాత ఘటనపై దర్యాప్తు చేపట్టిన ఢిల్లీ పోలీసులు శనివారం డీఆర్‌డీఓ శాస్త్రవేత్తను అరెస్టు చేశారు. అతడిని రోహిణి కోర్టులో హాజరుపరచనున్నారు. సీసీటీవీ ఫూటేజ్ ఆధారంగా ఈ శాస్త్రవేత్తను గుర్తించిన‌ట్లు చెప్పారు. వందల సీసీటీవీల పూటేజీలలో వేల సంఖ్యలో కోర్టు అవరణలోకి వాహనాలు వచ్చాయని, వాటన్నింటినీ పరిశీలించే క్రమంలో డీఆర్డీవో శాస్త్రవేత్త సీసీటీవీ రెండు సార్లు అత‌ను క‌నిపించాడ‌ని పోలీసులు తెలిపారు.

అతడ్ని గమనించగా.. ఒక‌సారి పేలుడు ప‌దార్ధాలు ఉన్న బ్యాగుతో కనిపించగా.. రెండ‌వ సారి బ్యాగు లేకుండా క‌నిపించిన‌ట్లు పోలీసులు తెలిపారు. ఓ కేసులో లిటిగేష‌న్లో ఉన్న డీఆర్డీవో శాస్త్ర‌వేత్త‌.. లాయ‌ర్ ను చంపాల‌ని ప్లాన్ వేసినట్లు పోలీసుల ముందు అంగీక‌రించారు. నిందితుడిపై స‌దురు లాయ‌ర్ ప‌ది కేసులు న‌మోదు చేశాడ‌ని, అస‌హ‌నానికి గురైన అత‌ను ప్ర‌తీకారంతో పేలుడుకు పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. కాగా మొదట ఈ పేలుడు కోర్టు హాలులో ల్యాప్‌టాప్ పేలిపోయిందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. బ్యాగ్‌లోని ల్యాప్‌టాప్ బ్యాటరీలో సమస్య కారణంగా పేలిపోయి ఉంటుందని భావించారు. ఇది కుట్రగా భావించిన పోలీసులు దర్యాప్తులో డీఆర్డీవో శాస్త్రవేత్త నిందితుడిగా తేలాడని చేప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles