తెలంగాణలో మావోయిస్టులు తమ ఉనికి చాటుకుంటున్నారా..? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. రాష్ట్రంలోని ములుగు జిల్లాకు చెందిన మాజీ సర్పంచ్ ను అదుపులోకి తీసుకున్న మావోలు ఇవాళ అతడ్ని హతమార్చారు. జిల్లాలోని వెంకటాపురం మండల పరిధిలోని సూరవీడు గ్రామ మాజీ సర్పంచ్ రమేశ్ ను హతమార్చారు. ఈ మేరకు వాజేడు ఏరియా కమిటీకి చెందిన మావోయిస్టులు ప్రకటించారు. ఛత్తీస్ గడ్ రాష్ట్రంలో రమేశ్ మృతదేహాన్ని మావోయిస్టులు వదిలి వెళ్లారు. ఈ మేరకు మావోయిస్ట్ పార్టీ వెంకటాపురం - వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పేరుతో లేఖ విడుదల చేశారు.
స్వతహాగా ఆటో డ్రైవర్ అయిన మాజీ సర్పంచ్ కురుసం రమేశ్.. సమీపంలోని చెర్లకు వెళ్తుండగా సోమవారం రోజున ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కాగా గమనించిన స్థానికులు విషయాన్ని ఆయన భార్యకు తెలుపగా, వెంటనే స్పందించిన అమె.. మావోలకు తన భర్తను విడిచిపెట్టాలని కోరింది. తాను అమాయకుడని చెప్పింది. ఒకవేళ వారి దృష్టిలో తప్పుచేసినా క్షమించి వదిలేయాలని అమె ప్రాధేయపడింది. అయినా అమె వ్యధను పరిశీలనలోకి తీసుకోని మావోలు.. రమేశ్ పోలీస్ ఇన్ఫార్మర్ గా వ్యవహరించాడని.. అందుకనే హతమార్చినట్లు మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. ఆయన మృతదేహాన్ని ఛత్తీస్ గఢ్ లోని కొత్తపల్లి సమీపంలో వదిలేశారు.
కాగా రమేశ్ 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి సూరువీడు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గెలుపోందారు. ఆ తరువాత ఆయన భార్య రజితకు ఏటూరు నాగరం సామాజిక అసుపత్రిలో ఏఎన్ఎం ఉధ్యోగం రావడంతో మండల కేంద్రంలోని ఐటీడీఏ క్వార్టర్స్ సమీపంలో నివాసం ఉంటున్నాడు. అయితే గతంలో రమేశ్ మావోయిస్టులకు కొరియర్ గా పనిచేసి.. ప్రస్తుతం పోలీసులకు ఇన్ ఫార్మర్ గా పనిచేస్తున్నాడని అరోపించిన మావోయిస్టులు అతడ్ని హతమార్చారు. రమేశ్ కారణంగా స్థానికంగా ఓ ఎన్ కౌంటర్ జరిగిందని, మరో మావోయిస్టు హత్యకు కూడా రమఏష్ కారణంగా అరోపించిన మావోయిస్టులు అతడ్ని హతమార్చారు.
ఈ విషయమై చత్తీష్‌ఘడ్, తెలంగాణ సరిహద్దుల్లో ప్రజా కోర్టు నిర్వహించి రమేష్ చేసిన తప్పులను ఎత్తి చూపి ప్రజా కోర్టులో అతడిని మావోయిస్టులు హత్య చేశారు. కాగా, ములుగు పోలీసుల వలలో పడి ఇన్ఫార్మర్లుగా మారిన వారికి రమేశ్ హత్య ఓ గుణపాఠమని చెబుతూ.. మావోయిస్టులు లేఖను విడుదల చేశారు. కాగా స్థానిక పోలీసులు రమేష్ మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. అయితే తాజాగా వెలుగు చూసిన రమేశ్ హత్యతో ఛత్తీస్ గఢ్ సరిహద్దు జిల్లాల్లో మావోయిస్టులు తమ ఉనికిని చాటుకుంటున్నారన్న అనుమానాలు ఈ హత్యతో బలపడుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more