సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా వైరస్ మహమ్మారి కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ ప్రపంచదేశాలను గడగడలాడిస్తోంది. ఇప్పటికే సుమారు 100 దేశాలకు వ్యాపించిన ఒమిక్రాన్.. బ్రిటెన్, అస్ట్రేలియా, ఇజ్రాయిల్, జర్మనీ, ఆస్ట్రేలియాలలో మరణాలను కూడా నమోదు చేసుకున్నవిషయం తెలిసిందే. ఇదే సమయంలో ఇటు దేశంలోకి కూడా చోచ్చుకువచ్చిన ఈ మహమ్మారి దేశంలోనూ అంతకంతకూ తన ప్రభావాన్ని విస్తరిస్తోంది. దీంతో దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఏకంగా 578కి చేరింది. వీరిలో 151 మంది కోలుకున్నారని గణంకాలు స్పష్టం చేస్తున్నాయి.
మొత్తంగా దేశంలోని 19 రాష్ట్రాలకు సోకిన ఈ వైరస్.. దేశ రాజధాని ఢిల్లీలోనే అత్యధిక కేసులను నమోదు చేసుకుంది. ఇక అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల్లో నిన్నటి వరకు ముందున్న మహారాష్ట్రను దాటి.. తాజాగా అత్యధిక కేసుల నమోదుతో ఢిల్లీ ముందుంది. మహారాష్ట్రలో 141 కేసులను నమోదు చేసుకోగా, ఢిల్లీ 142 కేసులతో ముందుంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ గణంకాలను విడుదల చేసింది. ఆ తరువాత కేరళ, గుజరాత్, రాజస్థాన్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మధ్య ప్రదేశ్, అంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యధిక ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
ఇదలావుంగా, నిన్న ఏకంగా 7లక్షల మందికి పైగా ప్రజలు కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా, వారిలో 6531 మంది కరోనా బారినపడ్డారని వైద్యవర్గాలు విడుదల చేసిన గణంకాలు స్పసట్ం చేస్తున్నాయి. అయితే అంతకుముందు రోజుతో పోల్చితే ఈ కేసులు ఆరు శాతం మేర తగ్గాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇక కరోనా నుంచి 7141 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 3.47 కోట్ల మంది కరోనాబారిన పడగా, వారిలో 3.42 కోట్ల మంది కోలుకున్నారని.. రికవరీ రేటు 38.40 శాతానికి చేరింది. కాగా నిన్న కరోనా బారిన పడి 315మంది చనిపోగా మొత్తంగా 4.79 లక్షల మరణాలు చోటుచేసుకున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more