ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని మందుబాబులకు గోప్ప ఊరటనిచ్చే వార్తను ఏకంగా ప్రజాగ్రహ సభలో సెలవిచ్చారు. రాష్ట్రంలోని మందుబాబులు కూడా ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహంతో వున్నారని పసిగట్టిన ఆయన.. తాము అధికారంలోకి వస్తే.. వైసీపీ ప్రభుత్వం విక్రయిస్తున్న నాసిరకం మద్యానికి బదులుగా నాణ్యమైన మద్యాన్ని తక్కవ ధరకే అందిస్తామని అన్నారు. మద్యం క్వార్టర్ సిసాను కేవలం రూ.70కే అందిస్తామన్న ఆయన.. రెవెన్యూ మరింత మిగిలితే.. రాష్ట్రంలో మద్యం మరింత చౌకగా అంటే ఏకంగా రూ. 50కే అందిస్తామని చెప్పారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఒక్క క్వార్టర్ లిక్కర్ ధర రూ.200గా ఉంది. తెలంగాణలో ఇది ఇంచుమించు రూ.100గా ఉంది. లిక్కర్ కు సంబంధించి సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. నాసిరకం మద్యాన్ని అధిక ధరలకు విక్రయించి.. ప్రజలను నిట్టనిలువునా ప్రభుత్వమే దోపిడి చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో మద్యం బ్రాండ్లన్ని నాసిరకానివే అన్న ఆయన.జ. అన్నీ అధిక ధరలకే విక్రయిస్తున్నట్లు చెప్పారు. అందరికీ తెలిసిన ప్రముఖ బ్రాండ్లు మాత్రం ఆంధ్రప్రదేశ్ లో లభించవని ఆయన అన్నారు. రాష్ట్రంలో మద్యం తీసుకునే ప్రతీ వ్యక్తీ నెలకు 12వేల రూపాయలను మద్యానికి వెచ్చిస్తున్నారని సోమువీర్రాజు అన్నారు.
ప్రభుత్వం సంక్షేమ పధకాలను భలేగా చేపట్టిందని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారని.. అయితే కుడి చెత్తో ఇచ్చి ఎడమ చేతితో లాక్కోవడం ప్రభుత్వానికి అలవాటుగా మారిందిని ఆయన పథకాలకు, మధ్యానికి మధ్య ఉన్న లింక్ ను చెప్పారు. రాష్ట్రంలో కోటి మంది మద్యం తాగేవారు వున్నారని, వారికి ఏదో పథకం కింద లభించే ఆరు నుంచి ఏడు వేల రూపాయలను.. మద్య పేరుతో లాగేసుకుంటున్నారని అన్నారు. ఇక పైపెచ్చు మద్యం కోసం ఏకంగా ఇంట్లోని ఐదు వేలు కూడా ఖర్చుపెడుతున్నారని అన్నారు. రాష్ట్రంలోని మందు బాబులందరూ బీజేపికి ఓటు వేస్తే.. మద్యం క్వార్టర్ సీసాను రూ.75కే ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. రాష్ట్రంలోని అధికార పార్టీ నేతలు రాష్ట్రంలో లిక్కర్ ఫ్యాక్టరీలను నడుపుతూ.. ప్రభుత్వానికి నాసిరకం లిక్కర్ ను సరఫరా చేస్తున్నట్టు వీర్రాజు ఆరోపించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more