ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిపై ఇంకా అనిశ్చితి వీడటం లేదు. ఓ వైపు ఈ కరోనా వేరియంట్ మహమ్మారి శరవేగంగా ప్రపంచాన్ని తన కబంధహస్తాలలో చుట్టేస్తుంటే.. మరోవైపు తీవ్రత మాత్రం అంతగా లేదని ఇప్పటివరకు అందిన సమాచారం. కాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం ఒమిక్రాన్ వేరియంట్ విషయంలో ప్రపంచ దేశాలన్నీ అత్యంత అప్రమత్తతో వ్యవహరించాలని సూచించింది. ఇది ఇప్పటికీ అత్యంత ప్రమాదకరమైన వేరియంట్ గానే తాము భావిస్తున్నామని.. దీని ప్రభావంతో అనేకమంది ఒక్కసారిగా ఆసుపత్రుల పాలయ్యే అవకాశాలు వున్నాయని హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఇది ప్రపంచవ్యాప్తంగా నమోదు చేస్తున్న రికార్డు స్థాయి గణంకాలే ఇందుకు నిదర్శనమని చెప్పింది.
దాదాపుగా అన్ని దేశాల్లో కరోనా మహమ్మారి ఇక ముగిసిన ఉదంతమే అనుకుంటున్న తరుణంలో వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్.. చాలా దేశాల్లో మళ్లీ కేసులు గణనీయంగా పెరగడానికి కారణమని పేర్కొంది. నవంబర్ 24న వెలుగుచూసిన ఈ వేరియంట్.. అత్యంత వేగంగా కేసులను పెంచుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 11 శాతం పెరగడానికి ఒమిక్రాన్ వేరియంట్ కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక జారీ చేసింది. వరుసగా వెల్లడవుతున్న ఆధారాలను చూస్తుంటే డెల్టా కంటే అధికంగా వృద్ధి చెందే అనుకూలత ఒమిక్రాన్ వేరియంట్ కు ఉన్నట్టు తెలుస్తోందని డబ్యూహెచ్ఓ తెలిపింది.
బ్రిటన్, అమెరికా సహా చాలా దేశాల్లో కేసులు శరవేగంగా పెరగడానికి ఈ వేరియంట్ కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తం చేసింది. అయితే ఈ వేరియంట్ తొలిసారిగా నవంబర్ 24న దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడ మాత్రం ఒమిక్రాన్ వేరియంట్ కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు డబ్యూహెచ్ఓ అధికారులు వెల్లడించారు. ఇక్కడ కేసులు 29 శాతం మేర తగ్గాయని పేర్కొంది. కార్టికో స్టెరాయిడ్స్, ఇంటర్ లూకిన్ 6 రిసెప్టర్ బ్లాకర్లు కరోనా రోగుల చికిత్సలో ప్రభావవంతంగా పని చేయగలవని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఒమిక్రాన్ వేరియంట్ ను న్యూట్రలైజ్ చేయడంలో మోనోక్లోనల్ యాంటీ బాడీల ప్రభావం తక్కువగా ఉంటున్నట్టు తెలియజేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more