దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి వారం వ్యవధిలో ఐదు రెట్లు పెరిగింది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు ఇప్పటికే దాదాపుగా 2700కి చేరాయి. ఇలా దేశంలో మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. దీనికి న్యూ ఇయర్ వేడుకలు మరింత ఆజ్యం పోసాయని, ఇక సంక్రాంతి పండుగ పర్వదినాలు మరింతగా ఇది ప్రబలే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ లో అంత తీవ్రమైన లక్షణాలు ఏమీ లేవని కథనాలు వస్తుండడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్రంగా స్పందించింది. ఒమిక్రాన్ వేరియంట్ ను తేలిగ్గా తీసుకోవద్దని ఇది కూడా ప్రమాదకార మహమ్మారేనని హెచ్చరించింది.
ఒమిక్రాన్ వేరియంట్ ను సాధరణంగా వర్షాకాలంలో సంక్రమించే జలుబులా తీసుకోవాద్దని.. ఇది తేలికపాటి వ్యాధి కాదని వార్నింగ్ ఇచ్చింది. అత్యంత వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తిచెందుతున్నా.. డెల్టాతో పోలిస్తే వ్యాధి తీవ్రత తక్కువగా ఉండటం కాస్త సానుకూలాంశం. అయితే ఇది సోకినవారిలో తీవ్రమైన లక్షణాలు కనబడకపోవడంతో ఇది తేలికపాటి వ్యాధిలా భావిస్తే మాత్రం అంతకు మించిన ప్రమాదం మరోకటి లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ఈ తరహా కథనాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్-19 టెక్నికల్ లీడ్ మరియా వాన్ కేర్ఖోవ్ తీవ్రంగా స్పందించారు. ఆ తరహా కథనాలను అమె తోసిపుచ్చారు.
ఒమిక్రాన్ వ్యాధి తీవ్రత తక్కువ కావడంతో ఆసుపత్రిలో చేరి చికిత్సలు చేయించుకోవాల్సిన అవసరం కూడా తక్కువగానే నమోదవుతోంది. అయితే ఇది తేలికపాటి వ్యాధిగా తీసిసారేసేలా కథనాలు రావడం అందోళన కలిగిస్తోందని అమె అన్నారు. ఈ తరహా కథనాలు ప్రమాదకరమని చెప్పారు. ఒమిక్రాన్ కేసులు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో.. ఇళ్లలోని వృద్దులు ఈ వేరియంట్ బారిన పడితే పరిస్థితి తీవ్రంగా ఉండవచ్చునని అమె అందోళన వ్యక్తం చేశారు. ఇక వృద్దులతో ఆసుపత్రులు కూడా నిండిపోవచ్చునన్నారు. అయితే మరణాల రేటు తక్కువగా నమోదు కావడం ద్వారా ఒమిక్రాన్ ను తెలికపాటిదని పరిగణిస్తూ కథనాలు రాయడం సముచితం కాదని అమె అన్నారు.
ఒమిక్రాన్ వేరియంట్ సహజ సిద్ధ టీకాగా పనిచేస్తోందంటూ వచ్చిన వార్తలను కూడా డబ్ల్యూహెచ్వో కొట్టిపారేసిన విషయం తెలిసిందే. అలాంటి ఆలోచన చాలా ప్రమాదకరమని, కొందరు బాధ్యతారహితమైన ప్రజలు ఇటువంటి వాటిని వ్యాప్తి చేస్తున్నారని డబ్ల్యూహెచ్వో వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటివి ప్రజల్లో ఆత్మసంతృప్తిని పెంపొందించడమే కాకుండా వైరస్ కట్టడిలో నిర్లక్ష్యాన్ని మరింత పెంచుతాయని హెచ్చరించారు. ఒమిక్రాన్ వ్యాప్తితో విరుచుకుపడుతోన్న తరుణంలో డబ్ల్యూహెచ్వో అన్ని దేశాల ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తోంది. సమూహాలు, సమావేశాల వంటి కార్యక్రమాలపై నిషేధం విధిస్తూ.. కోవిడ్ ప్రోటోకాల్ పాటించేలా చేయాలని సూచిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more