తమిళనాడు పాడిపరిశ్రమశాఖ మంత్రిగా సేవలందించిన అన్నాడిఎంకే మాజీమంత్రి రాజేంద్ర బాలాజీని ఆ రాష్ట్ర పోలీసులు కర్ణాటకలో అరెస్టు చేశారు. నాటకీయ పరిణామాల మధ్య కొనసాగిన ఈ అరెస్టు తరువాత ట్రాన్సిట్ వారెంటుపై ఆయనను తమిళనాడుకు తరలించారు. అయితే గత కొన్నాళ్లుగా తప్పించుకు తిరుగుతున్న ఆయన తనను పోలీసులు అరెస్టు చేస్తారని తప్పించుకు తిరుగుతున్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. పాడిపరిశ్రమకు చెందిన నిధుల ధుర్వినియోగంతో పాటు పలువురు నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పిస్తానని చెప్పిన ఆయన కోట్ల రూపాయలను మోసగించినట్లు అభియోగాలు ఎదర్కోంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై గతేడాది నవంబర్ 15న కేసు నమోదైంది.
పోలీసులు అరెస్టు చేయకుండా ఉండేందుకు గతంలో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆయన పిటిషన్‌ను విచారించిన మద్రాసు హైకోర్టు బెయిల్ పిటీషన్ ను రాష్ట్రోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉండడంతో రాజేంద్ర బాలాజీ తప్పించుకుని అజ్ఞాతంలోకి వెళ్లాడు. రాష్ట్రం వదిలి కర్ణాటకకు వెళ్లి అక్కడ అజ్ఞాతంలో వున్నారు. దీంతో కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంత్రిగా కోనసాగిన సమయంలో ఆయన రూ.3కోట్ల 10లక్షలు అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆరు గంటల పాటు ఆయనను ప్రశ్నించిన మీదట.. వైద్య పరీక్షలు నిర్వహించి విరుదునగర్ జిల్లా కోర్టులో హాజరుపర్చారు. దీంతో జిల్లా కోర్టు ఆయనకు పక్షం రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కు పంపింది.
20 రోజులకు పైగా పోలీసులు అతని కోసం వెతుకుతున్న అనంతరం నిన్న ఉదయం కర్ణాటకలోని హాసన్ లో దాగివున్నట్లు పక్కా సమాచారంతో వెళ్లిన తమిళనాడు పోలీసులు అక్కడి పోలీసుల సహకారంతో అరెస్టు చేశారు. ఆయన తన కారును డ్రైవింగ్ చేస్తుండగా పోలీసులు చుట్టుముట్టారు. రాజేంద్ర బాలాజీతో పాటు ఉన్న మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ట్రాన్సిట్ వారెంట్ రావడంతో రాజేంద్ర బాలాజీని అర్ధరాత్రి తమిళనాడుకు తీసుకొచ్చారు. అనంతరం శ్రీవిల్లిపుత్తూరులో ఉంచి 6 గంటలపాటు విచారించిన అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి శ్రీవిల్లిపుత్తూరు కోర్టులో హాజరుపరిచారు. అనంతరం అతడిని 15 రోజుల రిమాండ్‌కు తరలించారు.
అయితే రాజేంద్ర బాలాజీ తన అరెస్టు ఖాయమన్న నిర్థారణ కాగానే దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కాగా అది కూడా ఇవాళే కాకతాళీయంగా విచారణకు వచ్చింది. దీంతో రాజేంద్ర బాలాజీ బెయిల్ పిటిషన్ ఇవాళ విచారణకు రావాల్సిన ఆవశ్యకత ఏమిటి? ఆ లోపు ఆయన మద్దతుదారులను ఎందుకు వేధించారు.? ఇది రాజకీయ ప్రేరేపిత కేసునా? అని సుప్రీం న్యాయమూర్తి ప్రశ్నించారు. ఈ ఆరోపణలను వెంటనే కొట్టిపారేసిన తమిళనాడు ప్రభుత్వం.. తమకు ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని పేర్కొంది. దీంతో ఆయన పిటిషన్‌పై విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేశారు. ఈ కేసులో మాజీమంత్రి సహాయకులు బాబూరాజ్, బలరాం, న్యాయవాది ముత్తుపాండియన్‌లను అరెస్టు చేయావద్దని అదేశాలను జారీ చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more