సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా వైరస్ మహమ్మారి కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ ప్రపంచదేశాలను గడగడలాడిస్తోంది. ఇప్పటికే ప్రపంచదేశాలన్నింటికీ వ్యాపించిన ఒమిక్రాన్.. బ్రిటెన్, అస్ట్రేలియా, ఇజ్రాయిల్, జర్మనీ, ఆస్ట్రేలియాల సహా భారతదేశంలోనూ మరణాలను నమోదు చేసుకున్నవిషయం తెలిసిందే. దేశంలో ఒక్క మరణాన్ని మాత్రమే నమోదు చేసుకుంది, అయినా భారత ప్రభుత్వం మాత్రం అప్రమత్తమైంది. రోజురోజుకు తన ప్రభావాన్ని విస్తరిస్తోన్న ఈ కొత్త మహమ్మారి వేరియంట్ నేపథ్యంలో 60 ఏళ్లు పైబడిన వృద్దులతో పాటు అనారోగ్య కారణాలతో సతమతమౌతున్నవారి అరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వారికి ప్రికాషనరీ కరోనా వాక్సీన్ డోస్ అందిస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఇవాళ్టి నుంచి వృద్దులకు కరోనా బూస్టర్ వాక్సీన్ అందుబాటులోకి రానుంది. దీంతో దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఏకంగా 4033కి చేరింది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు సోకిన ఈ వైరస్.. దేశ ఆర్థిక రాజధాని ముంబై సహా మహారాష్ట్రలోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత దేశరాజధాని ఢిల్లీలోనే ఎక్కువ కేసులు నమోదు చేసుకుంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ గణంకాలను విడుదల చేసింది. ఆ తరువాత కేరళ, గుజరాత్, రాజస్థాన్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మధ్య ప్రదేశ్, అంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యధిక ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
ఈ క్రమంలో దేశంలోని 5.75 కోట్ల మందికి మూడవ విడతగా బూస్టర్ డోసు అందించనున్నట్లు గత నెలలో వైద్య అరోగ్యశాఖ అధికారులతో సమావేశం జరిపిన ప్రధనమంత్రి మోది..60ఏళ్లు పైబడినవారికి బూస్టర్ డోస్ ఇస్తామని ప్రకటించారు. అయితే ఇవాళ్టి నుంచి ఈ బూస్టర్ డోసును దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో వున్న అరవై ఏళ్ల పైబడిన వ్యక్తులకు అందించనున్నారు. 60 ఏళ్లు పైబడిన వారు దేశవ్యాప్తంగా సుమారుగా 2.75 కోట్ల మంది ఉన్నారని, ఇక వీరితో పాటు రెండు కోట్ల మంది ఫ్రంట్ లైన్ వర్కర్లు, కోటి మంది హెల్త్ వర్కర్లకు కూడా ఈ టీకాను అందించనున్నారు.
ఈ బూస్టర్ డోస్ తీసుకోవడానికి ఎలాంటి ముందస్తు రిజిస్ట్రేషన్ అవసరం లేదని కేంద్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. బూస్టర్ డోస్‌కు అర్హులైనవారు నేరుగా సమీపంలోని వ్యాక్సినేషన్ సెంటర్‌కు వెళ్లి టీకా వేయించుకోవచ్చని వెల్లడించింది. అయితే, కోమార్బిడిటీస్‌తో సంబంధం లేకుండా వృద్ధులందరికీ బూస్టర్ డోస్ ఇవ్వాలనే విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నది. అయితే, సెకండ్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 9 నెలలు పూర్తయిన వారు మాత్రమే బూస్టర్ డోస్ తీసుకోవాలని సూచించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more