కరోనా వైరస్ మహమ్మారి గత రెండేళ్లుగా ప్రపంచదేశాలను గడగడలాడిస్తోంది. ఈ మహమ్మారి ప్రపంచ గమనాన్ని మార్చివేసింది. ఇప్పటికే పలు దేశాలు మూడు, నాలుగు కరోనా దశలు కూడా ఎదుర్కోన్నాయి. అయినా ఇప్పటికీ ఇంకా ప్రపంచాన్ని తన వేరియంట్లతో కోవిడ్ అతలాకుతలం చేస్తోంది. దశకు దశకు మధ్య రూపాంతరం చెందుతున్న ఈ వైరస్.. ఇప్పటికే డెల్టా వేరియంట్ అతతలాకుతలం చేసింది. ఇక తాజాగా ఒమిక్రాన్ తో అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఇదే అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందని, ఇక ముట్యేషన్లు అధికంగా వుండటంతో ఇది రోగనిరోధకశక్తిని కూడా ఏమార్చుతూ దాడిని కొనసాగిస్తోందని ఇప్పటికే వైద్య నిపుణులు హెచ్చిరించారు.
ఈ క్రమంలో ఫ్రాన్సులో మరో కొత్త వేరియంట్ బయటపడిన విషయం కూడా తెలిసిందే. ఒమిక్రాన్ ను మించిన మ్యూటేషన్లతో ప్రపంచం మొత్తాన్ని కొద్దిపాటి కాలంలోనే చుట్టేసేలా ఉండటం గమనార్హం. ఇది అత్యంత డేంజరస్ వేరియంట్ అని దీనికి ఏకంగా 46 మ్యూటేషన్లు ఉన్నాయని తాజా అధ్యయనాల్లో తేలింది. యూరప్ దేశమైన ఫ్రాన్స్‌లో ఈ కొత్త వేరియంట్ కేసులు నమోదైనప్పటికీ.. వారంతా ఆఫ్రికన్ దేశమైన కామెరూన్ నుంచి రావడం.. ఇక దక్షిణ ఫ్రాన్స్‌లోని మార్సెయిల్స్‌లో వారు ఉండటంతో ప్రస్తుతానికి ఈ వైరస్ ఆ ప్రాంతానికే పరిమితం అయ్యింది. వీటిని B.1.640.2 కేసులుగా వర్గీకరించిన ఐహెచ్‌యూ మెడిటెర్రనీ ఇన్ఫెక్షన్ ఇన్స్టిట్యూట్.. దీని బారిన 12 మంది మాత్రమే పడ్డారని గుర్తించింది.
ఇక తాజాగా మరో సరికొత్త పరిణామక్రమంలో డెల్టాక్రాన్ వైరస్ ప్రజలపై తన దాడిని కొనసాగిస్తోంది. ఇప్పటికే ఒమిక్రాన్ వేరియంట్ తో కూడిన థర్డ్ వేవ్ మరికొద్ది రోజులలో దేశాన్ని గజగజ వణిరేలా చేస్తోందన్న వార్తలతో చెమటలు పడుతుంటే.. ఇక ఈ కొత్త వేరియంట్ అటు డెల్టాతో పాటుగా ఇటు ఒమిక్రాన్ తో మేళవితమై కలసి దాడిని కొనసాగించనుందన్న వార్త ప్రపంచ దేశాల వెన్నులో భయాన్ని పుట్టిస్తున్నాయి. ఇప్పటికే డెల్టా పేరు వింటేనే భయంతో కంపించిపోతున్న దేశాలు అనేకం. అంతలా ప్రపంచ దేశాలపై ఈ వేరియంట్ తన ప్రభావాన్ని చూపింది. యావత్ ప్రపంచ మానవాళిపై డెల్టా వేరియంట్ ప్రభావం స్పష్టంగా కనిపించింది.
అలాంటి డెల్టా వేరియంట్ తో రోగనిరోధకశక్తిని ఏమార్చి మనుషులపై దాడి చేస్తున్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఈ రెండు కలసి వస్తున్నాయనగానే ప్రపంచవ్యాప్తంగా భయాందోళన వ్యక్తమౌతోంది. ఈ రెండింటి కలయికతో మరో కొత్త వేరియంట్ బయటపడింది, దీని పేరు డెల్టాక్రాన్ గా వైద్యనిపుణులు పెట్టారు. అయితే ఈ కొత్త రకం వేరియంట్ గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెపుతున్నారు. ఈ వేరియంట్ ను సైప్రస్ యూనివర్శిటీ వైరాలజీ నిపుణుడు డాక్టర్ లియోండియోస్ కోస్టిక్రిస్ గుర్తించారు. మరోవైపు డెల్టాక్రాన్ వేరియంట్ గురించి సైంటిస్టులు మాట్లాడుతూ... దీని ప్రభావం ఎంతమేర ఉంటుందో ఇప్పుడే చెప్పలేమని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more