భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచకు చెందిన వ్యాపారి నాగ రామకృష్ణ.. కుటుంబంతో పాటుగా సామూహిక ఆత్యహత్యకు పాల్పడేందుకు కారణమైన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవేందర్ రావు పైశాచిక చర్యలు, ఒత్తిడులు, బెదిరింపులే కారణమని మృతుడు నాగ రామకృష్ణ ఆత్మహత్యకు ముందు రికార్డు చేసిన సెల్పీ వీడియోలే కీలక సాక్ష్యాలుగా మారుతున్నాయి. అయితే ఈ సెల్ఫీ వీడియోలు ఎవరి ద్వారా బయటకు వచ్చాయి అన్న విషయాలతో పాటు వీటి విశ్వసనీయత కూడా న్యాయస్థానాల్లో చర్చకు వచ్చే అంశమై ముందుగానే అలోచించిన రామకృష్ణ.. తాను స్వయంగా రికార్డు చేసిన వీడియోలను ఎక్కడి పెట్టిందన్న విషయాన్ని తన స్నేహితుడికి టెక్ట్స్ మెసెజ్ చేశాడని తేలిసింది.
ఈ మేరకు పోలీసులు న్యాయస్థానానికి సమర్పించిన ఏడు పేజీల రిమాండ్ రిపోర్టులో పేర్కోన్నట్లు సమాచారం. వనమా రాఘవ అకృత్యాలు, పైశాచిక చర్యలపై ప్రజలందరికీ తెలిసేందుకు గాను ఓ మిత్రుడి సాయం తీసుకున్న విషయాన్ని కూడా పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. రామకృష్ణ ఆత్మహత్యకు ముందు తన మిత్రుడికి ఓ మెసేజ్ చేస్తూ.. తనను క్షమించాలని, తాను ఓ వీడియో చేసి కారు డ్యాష్ బోర్డులో పెట్టానని తెలిపారు. తన కార్యక్రమాలన్నీ అయిపోయాక 7474 నంబరుతో ఫోన్ అన్లాక్ చేసి వీడియో చూసి ఆ తర్వాత అందరికీ పంపాలని, కారు తాళం చెవి బాత్రూంపై పెట్టానని పేర్కొన్నారు. ఈ విషయాన్ని నీకు మాత్రమే చెబుతున్నానని రామకృష్ణ పేర్కొన్నారు.
ఈ మెసేజ్ ఆధారంగానే ఈ ఘటనకు సంబంధించి అన్ని ఆధారాలు సేకరించినట్టు కోర్టుకు సమర్పించిన ఏడు పేజీల రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. రామకృష్ణ కారులో ఆత్మహత్య లేఖతోపాటు ఏడు పేజీల అప్పుల కాగితాలు కూడా స్వాధీనం చేసుకున్నామని, వీటితోపాటు 34 నిమిషాల నిడివి ఉన్న సెల్ఫీ వీడియో ఉన్న ఫోన్ను సీజ్ చేశామని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. రాఘవకు కనుక బెయిలు లభిస్తే తనకున్న రాజకీయ పలుకుబడితో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తాడని, సాక్షుల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. కాగా, రిమాండ్ రిపోర్టుతోపాటు రాఘవపై గతంలో అధికారికంగా నమోదైన 11 కేసుల వివరాలను కూడా కోర్టుకు సమర్పించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more