Chiranjeevi Meets CM Jagan amid movie ticket prices row సినీ సమస్యలను దూరం చేసే శుభపరిణామం: చిరంజీవి

Chiranjeevi meets ap cm ys jagan mohan reddy amid movie ticket prices row

Jagan Mohan Reddy, Chiranjeevi, chiranjeevi ys jagan, latest tollywood news, ys jagan mohan reddy, ys jagan, ysr congress, Hyderabad, Movie ticket pricing, amicable decision, Telugu film industry issues, price of cinema tickets, theaters owners, exhibitors, cine industry workers, movie distributors, Andhra Pradesh, Politics

Actor Chiranjeevi on Thursday met Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy in Tadepally. After the meeting, the Acharya actor said an “amicable decision" is expected from the state government in about 10 days on the issues related to the Telugu film industry such as the price of cinema tickets, theaters, exhibitors, workers and distributors.

సీఎంతో సంక్రాంతి సమావేశం.. సినీ సమస్యలను దూరం చేసే శుభపరిణామం: చిరంజీవి

Posted: 01/13/2022 07:27 PM IST
Chiranjeevi meets ap cm ys jagan mohan reddy amid movie ticket prices row

తెలుగు సినీపరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని అనేక మంది నేతలు చాలా విధాలుగా చేసిన ప్రయత్నాలు కొంతవరకు ఫలించాయి. అయితే సినీ పరిశ్రమలో మొత్తంగా నెలకొన్న సమస్యను సవివరణంగా వివరించే ప్రయత్నం కూడా అసంపూర్తిగా జరిగింది. దీంతో ఎట్టకేలకు పండగ పూట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా సినిఇండస్ట్రీ పెద్దగా ఉన్న మెగాస్టార్ చిరంజీవిని లంచ్ సమావేశానికి పిలిపించారు. ఇద్దరి మధ్య దాదాపు రెండు గంటల పాటు సమావేశం జరిగింది. కాగా అవకాశం లభించడంతో సినీపరిశ్రమలోని ప్రతీఒక్కరి సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లారు చిరంజీవి. సినిమా థియేటర్ల యజమానులు, టికెట్ ధరలు, ఎగ్జిబిటర్ల సమస్యలు, డిస్ట్రిబ్యూటర్ల సమస్యలు, నిర్మాతల పరిస్థితులు, సినీ కార్మికులు, ఇలా అన్ని వివరించారు.

కాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో సమావేశానంతరం మీడియాతో మాట్లాడిన మెగాస్టార్ చిరంజీవి..  సీఎం జగన్ తో చాలా  సంతృప్తిగా జరిగిందని.. త్వరలోనే (రెండు మూడు వారాల్లోగా) చక్కని శుభవార్త వింటామని అన్నారు. పండగ పర్వదినం చోజున సీఎం జగన్ తో సమావేశం జరగడం.. తెలుగు సినీపరిశ్రమలో నెలకొన్న అన్ని సమస్యలకు పరిష్కారం లభించే శుభపరిణామానికి దారితీస్తుందని, చక్కటి శుభవార్త కోసం తెలుగు సినీపరిశ్రమతో పాటు తాను ఎదురుచూస్తున్నట్లు చెప్పుకోచ్చారు. గత ఏప్రిల్ నుంచి సినిమా ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్య‌ నెలకొన్న కొన్ని తర్జనభర్జనలకు సమాధానం త్వరలోనే దొరుకుతుందని చెప్పారు. సామాన్య ప్రజలకు వినోదం అందుబాటులో ఉండాలన్న జ‌గ‌న్‌ ప్రయత్నాన్ని అభినందిస్తున్నానని అన్నారు.

అలాగే జ‌గ‌న్‌ తీసుకున్న నిర్ణయాలతో సినీ ఇండస్ట్రీ ఎదుర్కొనే పరిస్థితులను కూడా జగన్‌కు వివరించినట్లు వెల్లడించారు. అయితే సినిమా టికెట్స్ విషయంపైనే ముఖ్యంగా అంతా చర్చించుకున్నారు. అసలు ఈ విషయం గురించి జగన్ ఏం అన్నాడు అనేది అందరికీ కావాలి. కానీ దీనిపై ఏపీ సీఎం ఏదీ తేల్చి చెప్పలేదని చిరంజీవి చెప్పాడు. టికెట్ ధరలు తగ్గిస్తారా పెంచుతారా అనేదానిపై స్పష్టంగా చెప్పలేనని.. కానీ అందరికీ న్యాయం జరుగుతుందని మాత్రం జగన్ చెప్పినట్లు మెగాస్టార్ తెలిపారు. అన్నివర్గాల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు చిరంజీవి వెల్లడించాడు. ఇండస్ట్రీలో బయటకు కనిపించేంత గ్లామర్ లేదని.. ఇక్కడ రెక్కాడితేగానీ డొక్కాడని కార్మికులు ఉంటారని.. వాళ్ల పరిస్థితి గురించి కాస్త ఆలోచించాలని జగన్‌ను విజ్ఞ‌ప్తి చేసిన‌ట్లు చిరు చెప్పాడు.

ఈ సమస్యలపై తాను చేసిన నిర్మాణాత్మక సూచనలపై జ‌గ‌న్‌ సానుకూలంగా స్పందించినట్లు మెగాస్టార్ తెలిపారు. అయితే అన్నీ ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లే మాట్లాడాడు కానీ ఒక్క‌టి కూడా స్ప‌ష్ట‌మైన హామీతో మీటింగ్ నుంచి బ‌య‌ట‌కు రాలేదు చిరంజీవి. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని.. ఎవరూ భయపడవద్దని జగన్ భరోసా ఇచ్చినట్లు చెప్పాడు కానీ మీరు ధైర్యంగా ఉండండి.. నేనున్నాను మీకు.. ముందులాగే ఇండస్ట్రీ ఉంటుంద‌నే హామీలు మాత్రం జగన్ ఇవ్వలేదు. అయితే సినిమా టికెట్ల ధరలపై వస్తున్న అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని జీవోలో మార్పులు చేసే విధంగా నిర్ణయం తీసుకుంటామని మాత్రం జగన్ చెప్పినట్లు చిరంజీవి తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles