'బికినీ గర్ల్'గా పేరుగాంచిన మోడల్, నటి అర్చనా గౌతమ్ కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడంపై రాజకీయ ప్రత్యర్థి పార్టీల మధ్య దుమారం రేగుతోంది. అర్చనా గౌతమ్ కు టికెట్ కేటాయించడంపై బీజేపీ, భారత హిందూ మహాసభ మండిపడుతున్నాయి. గతంలో మిస్ బికినీగా గెలుపోందిన అర్చనను బరిలోకి దింపడంతో కేవలం ప్రచారం కోసమే కాంగ్రెస్ అమెను బరిలోకి దింపిందని బీజేపి విమర్శించింది. బికిని గర్ల్ గా గెలిచిన తర్వాత అమె పలు సినిమాలు, టీవీ సీరియళ్లలో నటించారు. అయితే మహిళలకు ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలలో అఁధిక స్థానాలను కేటాయిస్తామని చెప్పిన ప్రియాంక తన మాట ప్రకారం అర్చనా గౌతమ్ కు కూడా ఉత్తరప్రదేశ్ లోని హస్తినాపూర్ నియోజకవర్గ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది.
ఈ నేపథ్యంలో బీజేపీ నేత రాకేశ్ త్రిపాఠి స్పందిస్తూ చౌకబారు ప్రచారాల కోసమే అర్చన లాంటి మహిళకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందని విమర్శించారు. ఆమెకు టికెట్ ఇవ్వడం వెనుక ప్రజాసేవ వంటి భావన లేదని చెప్పారు. మరోవైపు అఖిల భారత హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మాట్లాడుతూ, ఎంతో పవిత్రమైన హస్తినాపూర్ లో అర్చన వంటి వ్యక్తికి టికెట్ ఇచ్చారని మండిపడ్డారు. ఆమెకు టికెట్ ఇవ్వడం వల్ల ఈ పవిత్ర ప్రాంతంలో నివసించే ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మానసికంగా దెబ్బతిన్నదని... ఆ పార్టీ నుంచి ఇంతకంటే ఎక్కువగా ఏదీ ఆశించలేమని ఎద్దేవా చేశారు. అర్ధనగ్నంగా ఉన్న ఫొటోలను పోస్ట్ చేసే అర్చనకు టికెట్ ఇవ్వడం దారుణమని అన్నారు.
ఈ విమర్శలపై కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్థాయిలో స్పందించింది. రాజకీయాల్లోకి రావాలని ఒక కళాకారిణి కోరుకోవడంలో తప్పేముందని ప్రశ్నించింది. బీజేపీలో కూడా ఎంతో మంది నటులు, కళాకారులు ఉన్నారని చెప్పింది. ఒక నటి కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారని వ్యాఖ్యానించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి అశోక్ సింగ్ మాట్లాడుతూ.. ఓ నటిని బరిలోకి దింపినంత మాత్రాన రాజకీయాలకు వచ్చే ముప్పు ఏమైనా వుందా? అంటూ ప్రశ్నించారు. ఆమెకు రాజకీయాలంటే ఆసక్తి వుంది కాబట్టే టిక్కెట్ ఇచ్చామని స్పష్టం చేశారు. బీజేపీలో కూడా అనేక మంది నటులు ఉన్నారని, వారు మంత్రులు కూడా అయ్యారని ఆయన గుర్తు చేశారు. బీజేపీ ఆలోచనా రీతి ఎంత ఘోరంగా ఉంటుందని చెప్పడానికి ఇదో మచ్చు తునక అని అశోక్ సింగ్ మండిపడ్డారు.
తనకు టిక్కెట్ ఇవ్వడంపై వస్తున్న విమర్శల నేపథ్యంలో నటి అర్చన గౌతమ్ తీవ్రంగా మండిపడ్డారు. తన అభ్యర్థిత్వంపై వ్యాఖ్యానిస్తున్న వారికి తాను నేరం చేయలేదని.. అయినా తన క్యారెక్టర్ పై ముద్రవేయాలని బీజేపి నేతలు భావించడం సిగ్గుచేటని అమె అన్నారు. నటన, మోడలింగ్ అనేది తన వృత్తి అని, దానిని రాజకీయాలతో జోడించడం ఏమాత్రం బాగో లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. వృత్తి, రాజకీయం వేరని, కలిపి చూడొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందరో కళాకారులకు పదవులను కట్టబెట్టిన బీజేపి.. తనకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వడంతోనే విమర్శలను సంధించడంపై అమె మండిపడ్డారు. తాను పోటీ చేయడంతో బీజేపి అభ్యర్థులతో పాటు పార్టీ నేతల్లోనూ గుబులు మొదలైందని అమె పేర్కోన్నారు.
తాను భారత దేశం తరపున అనేక అందాల పోటీల్లో ప్రాతినిధ్యం వహించానని, ఎవరి మనోభావాలను దెబ్బతీయలేదని, అలాంటిప్పుడు తనపై విమర్శలను చేయడం అపాలని అమె ఘాటుగా బదులిచ్చారు. సినిమా పరిశ్రమతో అనుబంధం ఉన్న మహిళామణులకు బీజేపి కూడా స్థానం కల్పించింది. వారిలో ఒకరిని ఏకంగా కేంద్రమంత్రి స్థానంలో కూడా వున్నారు. వారే స్మృతి ఇరానీ, హేమమాలిని అని మఅె పేర్కోన్నారు. వారు సినిమాల్లో నటించారని.. పొట్టి బట్టలు ధరించారని.. అయితే వారికి ఉన్నత హోదా కల్పించి.. ప్రత్యర్థి పార్టీలో ఉన్న తనపై మాత్రం క్యారెక్టర్ మంచిదికాదని ముద్రవేసే ప్రయత్నాలు చేస్తారా.? ఇది ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు.
ఇక స్మృతి ఇరానీ కానీ హేమమాలిని కానీ ఏ పోటీలోనూ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించలేదని.. కానీ తాను దేశానికి ప్రాతినిథ్యం వహించి.. 30 దేశాల నుండి ప్రతినిదులను తోసిరాజుతూ మొదటి స్థానంలో నిలిచానని అమె అన్నారు, తాను హస్తినాపురం ప్రజలతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఆశిస్తున్నాను. కానీ కొంతమంది తనపై తప్పుడు ప్రచారం చేసి తన క్యారెక్టర్ పై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని అమె అరోపించారు. తన దుస్తులను బట్టి తనను అంచనా వేస్తున్నారు. నేటి ప్రపంచంలో, ప్రతీ విషయంలో అమ్మాయిలు అబ్బాయిలతో సమానమని చెప్పారు. తన వృతి రిత్యా తాను వేసుకున్న బట్టలతో తన క్యారెక్టర్ ను నిర్ణయించే అధికారం ఎవరికి ఉందని అమె ప్రశ్నించారు, తనను అందరు రీల్ లైప్ లో చూశారని, కానీ రియల్ లైఫ్ లో చూడలేదని అర్చనా గౌతమ్ అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more