దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే చాలా మంది రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నారు. బూస్టర్ డోస్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు కూడా వ్యాక్సినేషన్ జరుగుతోంది. అయితే, ఇప్పటికీ ఒక్క డోసు వ్యాక్సిన్ కూడా వేయించుకోని వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఇలాంటి వారి కోసం హర్ గర్ దస్తాక్ అంటూ ఓ కొత్త పథకంతో దేశంలోని ప్రతీ ఇంటికీ వెళ్లీ కరోనా టీకాలు తీసుకున్నవారి ఇళ్ల వద్ద హెల్త్ వాలెంటీర్లు టీకా తీసుకున్నారని సంతకం చేసిన స్టికర్ ను కూడా అతికించే ఏర్పాటు చసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ వేయించుకోని వారికి బలవంతంగా వ్యాక్సిన్ వేయించాలనే చర్చ కూడా జరుగుతోంది.
అయితే కోవిడ్ టీకాలు తీసుకునేందుకు నిరాకరించిన కొందరు చెట్లు ఎక్కడం, లేదా మరేదో విధంగా టీకాలను తీసుకునేందుకు నిరాకరించిన వీడియోలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇక అనేక మంది భయపడుతూనే.. వీడియోలు తీసుకున్నారు. కొందరు పెద్దవాళ్లూ టీకాలు తీసుకుంటూ ఏడ్చేచారు. ఇంతలా అపనమ్మకంతో టీకాలు తీసుకునేలా చేయడంతో దీనిపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు విచారణ చేసింది. దీంతో అత్యున్నత న్యాయస్థానానికి కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. వ్యాక్సిన్ వేయించుకోవాలని ఏ ఒక్కరినీ ఒత్తిడి చేయలేమని సుప్రీంకు కేంద్రం తెలిపింది. అంగవైకల్యంతో బాధ పడుతున్న వారు టీకా కేంద్రాలకు వెళ్లి వ్యాక్సిన్ వేయించుకోవడం కష్టతరమని... ఈ నేపథ్యంలో వారికి వారి ఇంటి వద్దకే వెళ్లి వ్యాక్సిన్ వేయాలంటూ సుప్రీంకోర్టులో ఓ స్వచ్ఛంద సంస్థ పిల్ వేసింది.
వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లేకపోతే వారికి ఇబ్బంది కలిగే అవకాశం ఉందని కోర్టుకు తెలిపింది. ఈ పిల్ పై సుప్రీం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టుకు కేంద్ర అఫిడవిట్ సమర్పించింది. బలవంతగా ఎవరికీ వ్యాక్సిన్ వేయించలేమని అఫిడవిట్ లో కేంద్రం తెలిపింది. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి అనే నిబంధన లేదని చెప్పింది. కేంద్ర వైద్యారోగ్య శాఖ విధించిన కోవిడ్ నిబంధనల్లో బలవంతపు వ్యాక్సినేషన్ ప్రక్రియ లేదని తెలిపింది. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని మాత్రమే కేంద్రం చెపుతుందని... దీనికి సంబంధించి మీడియా, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ద్వారా జనాల్లో చైతన్యం తీసుకొచ్చామని చెప్పింది. ఏ ఒక్కరి వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు వ్యతిరేకంగా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఒత్తిడి చేయలేమని తెలిపింది. వ్యాక్సిన్ వేయించుకోవాలనేది వారి వ్యక్తిగత అంశమని స్పష్టం చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more