Bihar woman gives birth to baby with four hands and legs బీహార్ లో నాలుగు కాళ్లు, చేతులతో వింత శిశువు జననం..

Bihar woman gives birth to baby with four hands and legs

Katihar latest news, Birth of a child with four hands four legs in Katihar, Unique Child Born in Katihar, Mufassil police station, Katihar Sadar Hospital, Bihar, Crime

A woman gave birth to a child with four arms and legs at Katihar Sadar Hospital in Bihar. According to doctors, both the mother and the child are healthy. The doctors say that the unusual birth was due to lack of proper development of the twins growing inside during pregnancy.

బీహార్ లో వింత శిశువు జననం.. దేవతగా భావించి పూజలు చేస్తున్న జనం..

Posted: 01/19/2022 11:22 AM IST
Bihar woman gives birth to baby with four hands and legs

బీహార్‌లో ఓ మహిళ వింత శిశువుకు జన్మనిచ్చింది. నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో జన్మించిన శిశువును చూసేందుకు స్థానికులు ఎగబడుతున్నారు. బీహార్ లోని కటిహార్ జిల్లాలోని సదర్ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది. అయితే బిడ్డతో పాటు తల్లి కూడా క్షేమంగా వున్నారని వైద్యులు తెలిపారు. అసుపత్రి వర్గాల నుంచి సమాచారం అందుకున్న మహిళ భర్త, కుటుంబసభ్యులు, బంధువులు వింత శిశువు జన్మించడంపై అసుపత్రివర్గాలను నిందిస్తున్నారు. శిశువును స్కానింగ్ చేసిన సందర్భంలో కానీ.. బిడ్డ జన్మించేందుకు ముందు జరిగిన పరీక్షల సమయంలో కానీ వైద్యులు ఈ మేరకు తమకు ఎలాంటి సూచనలు చేయలేదని వారు అరోపిస్తున్నారు.

సదర్ అసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని మహిళ భర్త అరోపిస్తున్నారు. తనకు వింత శిశువు జన్మించిందని అసుపత్రివర్గాల ఫోన్ ద్వారా సమాచారం అందించాయని తెలిపారు. అది విని తాను షాక్ కు గురయ్యానని చెప్పారు. వైద్యులు అన్ని పరీక్షలు చేస్తూ వచ్చి.. అంతా సవ్యంగానే వుందని చెప్పారని, ఇప్పుడు ఇలా మాటమార్చడంలో తమ నిర్లక్ష్య వైఖరే కారణమని అరోపించారు. మహిళ గర్భంలో కవలలు జన్మనివ్వాల్సి ఉందని, అయితే గర్బస్థ పిండం ఎదుగుదల సరిగా లేకపోవడం వల్లే ఇలా జరిగిందని వైద్యులు చెప్పడాన్ని మహిళ బంధువులు వ్యతిరేకిస్తున్నారు. అయితే, వైద్య చికిత్సలో లోపం వల్లే ఇలా జరిగిందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

తన భార్య గర్భంతో ఉండగా తీసిన అల్ట్రాసౌండ్ స్కానింగ్ లో ఈ విషయం ఎప్పుడూ బయట పడలేదన్నారు. వైద్యులు కూడా లోపల శిశువు సరిగా పెరగడం లేదన్న విషయాన్ని తమతో చెప్పలేదని, ఇది ముమ్మాటికీ వైద్యుల నిర్లక్ష్యమేనని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే వింత శిశువును చూసేందుకు స్థానికులు ఎగబడుతున్నారు. శిశువుకు నాలుగు కాళ్లు, నాలుగు చేతులు ఉండడంతో వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు. కాగా, ఈ శిశువును దేవతగా భావించిన కొందరు మొక్కుతుండటం కూడా గమనార్హం. శిశువును ఫోటోలో, వీడియోలు తీసిన కొందరు నెటిజనులు వాటిని సోషల్ మీడియాలోనూ అప్ లోడ్ చేస్తున్నారు. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles