Four Killed and one Injured in Inglewood Shooting అమెరికాలో కాల్పుల కలకలం.. హౌజ్ పార్టీపై అగంతకుల బీభత్సం..

Four people killed and one wounded in ambush shooting at inglewood house party

Four Killed in Inglewood Shooting, One Injured in Inglewood Shooting, birthday party turned violent in Inglewood, Four Killed in House party Shooting, Four Killed in Inglewood shooting, Four Killed in Los Angeles shooting, Four Killed in California shooting, US Gun Culture, Hand Gun, Multiple shooters, four killed, House party Shooting, Inglewood, Los Angeles, California, US, Crime

Multiple shooters opened fire at a house party in Inglewood in California’s Los Angeles on Sunday killing four and injuring one. Police have apprehended one survivor who said that he is a member of a gang from another city. Two women and two men were killed in the gunfire while another man was hospitalised in critical condition. According to a report by US news agency CBS2, the man is expected to survive.

అమెరికాలో కాల్పుల కలకలం.. లాస్ ఏంజెలెస్ హౌజ్ పార్టీపై అగంతకుల బీభత్సం..

Posted: 01/24/2022 11:18 AM IST
Four people killed and one wounded in ambush shooting at inglewood house party

అమెరికాలో తుపాకి మరోమారు గర్జించింది. అధికారులపైనో, లేక సహచర సిబ్బందిపైనో లేక పగ సాధింపు, క్షణికావేశ చర్యల్లో భాగంగా వినిపించే కాల్పుల శబ్దాలు ఈ సారి ఓ ఇంటిని లక్ష్యంగా చేసుకున్నాయి. కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్ ఏంజెల్స్ లో.. ఓ ఇంట్లో జరుగుతున్న హౌజ్ పార్టీపై అగంతకులు తుపాకులతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో నలుగురు మరణించగా, మరో వ్యక్తి అత్యంత విషమ పరిస్థితుల మధ్య అసుపత్రిలో చికిత్స పోందుతున్నాడు. లాస్ ఏంజెలెస్ సమీపంలో ఇంగ్లీవుడ్‌లోని ఓ ఇంట్లో ఐదుగురు సభ్యులు ఏర్పాటు చేసుకున్న పార్టీపై దుండగుడు జరిపిన కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. వేకువజామున 1.30 నిమిషాలకు పార్టీని ఎంజాయ్ చేస్తున్న ఆ ఇంట్లోకి గుర్తు తెలియని అగంతకులు ప్రవేశించి పార్టీలో పాల్గోన్న ఐదుగురు వ్యక్తులపై తుపాకులతో తెగబడ్డారు. ఒక్కసారిగా కాల్పులకు తెగబడటంతో కనీసం తప్పించుకునే అవకాశం కూడా లేకపోవడంతో పార్టీలో పాల్గోన్న ఐదుగురు వ్యక్తుల్లో నలుగురు ఘటనాస్థలంలోనే అసువులు బాసారు. అయితే మరణించిన నలుగురు మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. తీవ్రంగా గాయపడిన మరొకరు ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. సమచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నా నిందుతుల ముఠా అప్పటికే తప్పించుకుంది.

కాగా, పార్టీపై జరిగిన ఈ మెరుపుదాడిలో ఓ రైఫిల్, హ్యాండ్ గన్‌ను ఉపయోగించినట్టు ఇంగ్లీవుడ్ పోలీసులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై స్పందించిన ఇంగ్లెవుడ్‌ మేయర్‌ జేమ్స్‌ బట్స్‌.. ఇది ముమ్మాటికి ప్రతీకారేచ్చతో జరిగిన ఘటనగా పేర్కోన్నారు. చూస్తుంటే బాధితులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడినట్టు కనిపిస్తోందన్నారు. ఈ ఘటనలో గాయపడిన మరో వ్యక్తి తాను మరో నగరంలోని స్ట్రీట్ గ్యాంగ్ సభ్యుడనని అంగీకరించాడని ఆయన పేర్కొన్నారు. 1990 తర్వాత ఇంగ్లీవుడ్‌లో జరిగిన అతిపెద్ద సింగిల్ షూటింగ్ ఘటన ఇదేనని మేయర్ జేమ్స్ బట్ తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసుల ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles