బీజేపి నేతల తనయులు హద్దుమీరుతున్నారు. ఇప్పటికే ఓ వైపు కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తనయుడు అషీశ్ మిశ్రా.. మూడు వ్యవసాయ చట్టాల ఉపసంహరణ డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేసిన రైతుల మీదుగా వాహనాలను తొక్కించి వారి అర్తనాధాలు, హాహాకారాలు చేస్తున్నా పట్టించుకోకుండా వెళ్లిన ఘటనలో ఇప్పటికే అరెస్టై.. జైలు ఊచలు లెక్కబెడుడుతున్నాడు. ఇక తాజాగా బీహార్లోని యూపీఏ ప్రభుత్వంలోని మరో బీజేపి మంత్రి తనయుడు కూడా తన తండ్రి సెక్యూరిటీ సిబ్బంది నుంచి తుపాకులు తీసుకుని ఎలాంటి లైనెన్సు కూడా లేకుండా.. ఏకంగా చిన్నారులపైన తూటాలను వదిలాడు.
మామిడితోటలో క్రికెట్ ఆడుకుంటున్న చిన్నారులపై మంత్రి కుమారుడు కాల్పులు జరిపిన ఘటన బీహార్లోని పశ్చిమ చంపారన్ జిల్లాలోని హర్డియా గ్రామంలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బీజేపీ నేత, రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి నారాయణ ప్రసాద్ ఇంటి పక్కనే ఉన్న మామిడితోటలో కొందరు చిన్నారులు, యువకులు కలిసి క్రికెట్ ఆడుతున్నారు. గమనించిన మంత్రి కుమారుడు బబ్లూ ప్రసాద్, అతడి వెంట ఉన్న మంత్రి సిబ్బంది మామిడి తోటలోకి వెళ్లి అక్కడ క్రికెట్ ఆడొద్దని కోరారు. అయితే చిన్నారులకు అధికారులు, అధికారాలు, మంత్రులు, పెద్దలు, హద్దులు గురించి తెలియకపోవడంతో.. వారు మేము తోటలో కదా అడుకుంటున్నామని.. మ్యాచ్ పూర్తైన తరువాత వెళ్లామని చెప్పారు.
స్వయంగా మంత్రి కుమారుడిని వచ్చి చెబుతున్నా ఏ మాత్రం జంకు, బొంకు లేకుండా చిన్నారులు నిరాకరించారు. అంతేకాదు వారితో కలిసి ఆడుతున్న యువకులు కూడా అక్కడి నుంచి వెళ్లడానికి ఇష్టపడకపోవడంతో వారి మధ్య వాగ్వివాదం మొదలైంది. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయిన మంత్రి కుమారుడు బబ్లూ.. కాసేపటికి నాలుగు వాహనాల్లో తన అనుచరులతో వచ్చి వారిపై దాడికి దిగారు. అంతటితో ఆయన కోపం చల్లారకపోవడంతో తన వద్ద ఉన్న తుపాకితో గాల్లోకి కాల్పులు జరిపారు. ఇక, ఆయన అనుచరులు జరిపిన దాడిలో నలుగురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
విషయం తెలిసిన గ్రామస్థులు ఆగ్రహంతో రగలిపోయి.. మంత్రి ఇంటిపైకి దాడికి దిగి.. ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. మంత్రి ఇంటి నుంచి పిస్టల్, రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై మంత్రి నారాయణ ప్రసాద్ స్పందిస్తూ.. గ్రామస్థులపైనే ఆరోపణలు చేశారు. వారు తమ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారని, తొలుత వారే తన కుటుంబ సభ్యులపై దాడి చేశారని ఆరోపించారు. ఆతర్వాత తన కుమారుడు లైసెన్స్ ఉన్న తుపాకితో మామిడితోట వద్దకు వెళ్లాడని, అది చూసి అతడిపైనా గ్రామస్థులు రాళ్లతో దాడి చేశారని పేర్కొన్నారు. తన వాహనాన్ని కూడా ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more