రాష్ట్రంలో సంక్రాంతి వేళ కృష్ణ జిల్లాలో రాజుకున్న క్యాసినో రగడ సోంత పార్టీ నేతలే వ్యతిరేకగళాన్ని వినిపించేలా చేస్తోంది. ప్రతిపక్షానికి చెందిన నాయకులు, కార్యకర్తలు వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు గుడివాడకు చేరుకుంటే.. వారికి వ్యతిరేకంగా వైసీపీ నేతలు, కార్యకర్తలతో అడ్డుకుని.. పరిస్థితిని ఉద్రిక్తంగా మార్చివేయగా.. వారి కార్యాలయాలపై రాళ్లు రువ్వించి. వాహనాలను ధ్వంసం చేయించిన ఘటనలతో ఇప్పటికే గుడివాడ అట్టుడికిపోతోంది. క్యాసినో నిర్వహించినట్లు ప్రతిపక్ష నేతలు అరోపణలు చేయడం కాదని., వారికి దమ్ముంటే సాక్ష్యాలు, ఆధారాలతో నిరూపించాలని డిమాండ్ చేయడం, అందుకు టీడీపీ నేతలు సాక్ష్యాలు, ఆధారాలుగా క్యాసినో వీడియోలను కూడా పోస్టు చేయడంతో వ్యవహారం మరింతగా ముదిరింది.
ఈ క్రమంలో మాట మార్చిన మంత్రి కొడాలి నాని ఓటమిపాలైన నేతలు నిజనిర్థారణ అంటూ వచ్చారే తప్ప.. ప్రజామోదం ఉన్న ఒక్క నాయకుడు కూడా అక్కడకు రాలేదని.. ఇంతలా ప్రజలు వారికి బుద్దిచెప్పినా., వారి పరిస్తితిలో మార్పు రాలేదని మంత్రివర్యులు ఎద్దేవా చేశారు. ఇందుకు టీడీపీ నేతలు కూడా ఘాటుగానే ప్రతిస్పందించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో తాము కృష్ణా జిల్లాలోని అనేక నియోజకవర్గాలలో టీడీపీ పసువువర్ణపు జెండాను అవిష్కరిస్తామని.. అందులో గుడివాడకు చెందిన అసెంబ్లీ కూడా ఉండనుందని తేల్చిచెప్పారు. ఈ రగడ అలా నడుస్తుండగానే వైసీపీకి చెందిన నేత సోమిశెట్టి సుబ్బారావు గుప్తా.. ఏపీ మంత్రి, క్యాసినో నిర్వహించాడనన్నా అరోపణలు ఎదుర్కోంటున్న కొడాలి నానిపై ఘాటుగానే స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా.. ఎంతో హుందాగా, ఉన్నతంగా వ్యవహరించాల్సిన కొడాలి నాని.. తన స్థాయిని తన చేజేతులా తగ్గించుకుంటున్నారని సుబ్బారావు గుప్తా ఆక్షేపించారు. రాష్ట్ర మంత్రివర్యులే ఇలాంటి బాషను వినియోగిస్తే.. రేపటి తరం దానినే అనుసరించే ప్రమాదముందని అన్నారు. కొడాలి నాని వాడుతున్న భాష తీవ్ర అభ్యంతరకరంగా ఉంటోందని అది అలాగే కొనసాగితే కార్యకర్తలే తిరగబడతారని సుబ్బారావు గుప్తా అన్నారు. ఒంగోలు ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి నాని వాడుతున్న భాష సరిగా లేదన్నారు. మంత్రి వాడుతున్న భాషకు కొందరు సంతోషిస్తున్నప్పటికీ ఎక్కువమంది మాత్రం చీదరించుకుంటున్నారని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలతో పార్టీకి తీరని నష్టం జరుగుతుందన్నారు.
మంత్రి నానిపై ముఖ్యమంత్రి జగన్ చర్యలు తీసుకోవాలని, ఆయన వాడుతున్న బాషతో పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదముందని సూచించారు. కొడాలి నాని వినియోగిస్తున్న బాషతో జరిగే నష్టం గుడివాడకు మాత్రమే పరిమితం కాదని.. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా అగ్గిరాజేలా ఉందని సూచనలు చేశారు. లేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో తానే గుడివాడ నుంచి బరిలోకి దిగుతానని తెలిపారు. ఒంగోలులో తన ఇంటిపై దాడిచేసిన వ్యక్తులపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి కుమారుడు ప్రణీత్‌రెడ్డి ఒంగోలులో మాఫియా నడుపుతుంటే బాలినేని మాత్రం ఏమీ తెలియనట్టు నటిస్తున్నారని అన్నారు. గుడివాడలో క్యాసినో నిర్వహించారన్న టీడీపీ ఆరోపణల్లో నిజం లేకుంటే ఆ పార్టీ నిజనిర్ధారణ కమిటీని ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more