30% tax on virtual digital asset transfer, says FM దేశ ఆర్థిక బడ్జెట్ అంచనాలు: రూ.39.45 లక్షల కోట్లు.. మరిన్ని హైలైట్స్

Budget 2022 highlights key changes announced by fm sitharaman

union budget, union budget 2022, budget 2022, nirmala sitharaman, budget speech, nirmala sitharaman union budget, nirmala sitharaman budget, education, digital india

Tax on income from transfer of virtual digital assets, digital rupee, incentives for start-ups — these are some of the highlights of Budget 2022-23 announced by Finance Minister Nirmala Sitharaman in Parliament Tuesday. The government has proposed a tax of 30 per cent on any income from transfer of virtual digital assets.

దేశ ఆర్థిక బడ్జెట్ అంచనాలు: రూ.39.45 లక్షల కోట్లు.. మరిన్ని హైలైట్స్

Posted: 02/01/2022 01:36 PM IST
Budget 2022 highlights key changes announced by fm sitharaman

పార్లమెంటులో 2022-2023 వార్షిక ఆర్థిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం ప్రవేశపెట్టారు. కేంద్ర బ‌డ్జెట్‌ను సీతారామ‌న్ గంట‌ పదిహేను నిమిషాల పాటు చదువుతూ దానిని సభలో సభ్యులకు వినిపించారు. కేంద్ర బ‌డ్జెట్‌ను కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదించింది. అంతకు ముందు ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కొవింద్‌తో భేటీ అయి.. బ‌డ్జెట్ విష‌యాల‌ను వివ‌రించారు.

 

నిర్మలా సీతారామన్‌ రూపోందించిన బడ్జెట్ అంచనాలు

వార్షిక బడ్జెట్ అంచనా రూ.39.45 లక్షల కోట్లు
ద్రవ్యలోటు: 6.9శాతం మూడేళ్లలో 4.5కు తగ్గింపు  లక్ష్యం
ఆదాయం: రూ22.84 లక్షల కోట్లు

క్రిప్టో కరెన్సీకి పచ్చజెండా

క్రిప్టో కరెన్సీలకు పన్ను మినహాయింపులకు అవకాశం లేదు
క్రిప్టో కరెన్సీ లావాదేవీలపై 30 శాతం పన్ను.
ఒక్క శాతం టీడీఎస్

డిజిటల్ రూపీ

ఆర్బీఐ ద్వారా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ త్వరలో
రూపాయికి మరింత బలాన్ని చేకూర్చేలా డిజిటల్ రూపీ
కరెన్సీ కార్యకలాపాల నిర్వహణ కోసం రూపకల్పన
డిజిటల్ రూపీ ఆగమనంతో అర్థిక వ్యవస్థకు ఊపు
సాంకేతిక ఆధారిత అభివృద్ధికి పెద్ద పీట
బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థ.

డిజిటల్ ఇండియా కోసం వేగంగా పరుగులు

కరోనా వల్ల విద్యను కోల్పోయిన విద్యార్థుల కోసం వన్ క్లాస్ వన్ టీవీ ఛానల్.   
ప్రాంతీయ భాషల్లో విద్యాభివృద్ధికి టీవీ ఛానెళ్లు.
డిజిటల్ విద్యను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా డిజిటల్ యూనివర్శిటీ.
యానిమేషన్ రంగాన్ని ప్రోత్సహించేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు.
ఉపాధ్యాయులకు డిజిటల్ నైపుణ్యాల శిక్షణ.
అన్ని మంత్రిత్వ శాఖల్లో కాగిత రహిత వ్యవస్థను తీసుకొస్తాం.
డిజిటల్ పేమెంట్స్ ను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు.
కమర్షియల్ బ్యాంకుల ద్వారా 75 జిల్లాల్లో 75 యూనిట్ల ఏర్పాటు.
అత్యాధునిక టెక్నాలజీతో చిప్ ఉన్న ఈ-పాస్ పోర్టులు.
8 ప్రాంతీయ భాషల్లో ల్యాండ్ రికార్డులు.
2022-23లో 5జీ సేవలను ప్రైవేట్ టెలికాం సంస్థలు అందుబాటులోకి తీసుకొస్తాయి.
2025 కల్లా భారత్ ఇంటర్నెట్ ఆప్టికల్ ఫైబర్ ప్రాజెక్ట్ పూర్తవుతుంది.
మారుమూల ప్రాంతాల్లో కూడా ఆప్టికల్ ఫైబర్ సౌకర్యం.
అన్ని పోస్టాఫీసులను కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ తో అనుసంధానం చేస్తాం.

వచ్చే 25 ఏళ్ల అమృత కాలానికి ఈ బడ్జెట్ దోహదం

ప్రపంచంలోనే మన దేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది.
వచ్చే 25 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్  
పేద, మధ్య తరగతి పురోగతి కోసం కృషి  
పారదర్శకమైన సమీకృత అభివృద్దికి ఈ బడ్జెట్ నాంది
అందరి ప్రయోజనాల పరిరక్షణ లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన
గృహ, వసతులు, తాగునీటి కల్పనలో శరవేగంగా ముందుకు
డీబీటీ ద్వారా పేదలకు నేరుగా ఆర్థిక సాయం అందుతోంది
సీఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్ తో ఆర్థిక వ్యవస్థకు దిశానిర్ధేశం
వచ్చే ఐదేళ్లలో 13 లక్షల కోట్ల ఉత్పాదకతకు తగిన ప్రోత్సాహం
ఈ ఐదేళ్లలో 60లక్షల ఉద్యోగ అవకాశాల కల్పన ధ్యేయం
యువత, మహిళ, రైతు, ఎస్సీ,ఎస్టీలకు ఊతమిచ్చే బడ్జెట్

కరోనా మహమ్మారిని సవాళ్లను అధిగమిస్తున్నాం

కరోనా వల్ల ఎదురవుతున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోంటున్నాం
కరోనా కట్టడిలో వాక్సీనేషన్ కార్యక్రమంలో బాగా కలిసివస్తోంది
కరోనా నుంచి ప్రజలను కాపాడటంలో టీకాది కీలక పాత్ర

రాష్ట్రాలకు సాయం కోసం నిధి ఏర్పాటు

ప్రత్యేక నిధి ద్వారా రాష్ట్రాలకు రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణం
ప్రత్యేక నిధి ద్వారా 50 ఏండ్లకు రాష్ట్రాలకు వడ్డీ రహిత రుణం
రాష్ట్రాల రుణ పరిమితికి మించి ఆర్థిక సాయం
పీఎం గతిశక్తి ఉత్పాదక మూలధన వ్యయాలకు రుణాల వినియోగం
మూలధన పెట్టుబడుల కోసం రాష్ట్రాలకు కేంద్రసాయం
దేశవ్యాప్తంగా మూలధన పెట్టుబడుల కోసం రూ.10.68 లక్షల కోట్ల కేటాయింపు

ఎంఎస్ఎంఈలకు నూతన పోర్టల్

ఎంఎస్ఎంఈలకు నూతన పోర్టల్ తో మార్కెటింగ్ సహాకారం
ఎంఎస్ఎంఈల ఉత్పత్తుల అమ్మకాలకు ప్రత్యేక ఫ్లాట్ ఫాం
వ్యవసాయ ఉత్పత్తుల విలువల పెంపుకు స్టార్టప్ లకు ఆర్థిక సాయం
రైతులకు అద్దె ప్రాతిపదికన వ్యవసాయం పనిముట్లు
దేశంలో నాలుగు చోట్ల మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కుల ఏర్పాటు

వేతన జీవుల ఆశలు నిరాశే.. పన్ను జోలికి వెళ్లని మంత్రి

ట్యాక్స్ రిటర్నులకు రెండేళ్ల సమయం.
రిటర్నుల్లో లోపాలను సరిదిద్దుకోవడానికి ట్యాక్స్ పేయర్స్ కు అవకాశం.
పన్ను శ్లాబుల్లో ఎలాంటి మార్పు లేదు.
ఇకపై సులభతరంగా ఐటీ ఫైలింగ్. 80సీ, 80డీ సెక్షన్లలో ఎలాంటి మార్పు లేదు.

జాతీయ రహదారులు సహా ఇతర ముఖ్యాంశాలివే:

జాతీయ రహదారులను 25 వేల కిలో మీటర్లకు పెంచుతాం.
అత్యాధునిక వసతులతో కొత్త వందే భారత్ రైళ్లు.
కవచ్ పథకం కింద 2 వేల కిలోమీటర్లు.
400 కొత్త జనరేషన్ వందే భారత్ రైళ్లు.
100 పీఎం గతి శక్తి కార్గో టెర్మినల్స్ ఏర్పాటు
దేశంలో నాలుగు ప్రాంతాల్లో లాజిస్టిక్ పార్కుల ఏర్పాటు.
పర్వతమాల ప్రాజెక్టు కింద 8 రోప్ వేల నిర్మాణం.
60 కిలోమీటర్ల దూరంలో ఒక్కో రోప్ వే నిర్మాణం.
డ్రోన్ టెక్నాలజీని పెంచేందుకు డ్రోన్ శక్తి పథకం.  
రక్షణ రంగానికి కావాల్సిన వాటిని 68 శాతం దేశీయ పరిశ్రమల నుంచే సమకూర్చుకుంటాం.
రక్షణ రంగంలో పరిశోధనల కోసం ప్రైవేట్ సంస్థలకు ప్రోత్సాహం.
రక్షణ రంగంలో ప్రైవేట్ సంస్థలకు అవకాశం.
పురుగు మందుల వినియోగం కోసం డ్రోన్ల సహకారం.
పీఎం ఆవాస్ యోజన కింద 80 లక్షల గృహాల నిర్మాణం.
బొగ్గును రసాయనంగా మార్చేందుకు ప్రత్యేక పథకం.
బొగ్గు ద్వారా గ్యాస్ ఉత్పత్తి కోసం 4 పైలట్ ప్రాజెక్టులు.
విద్యుత్ వాహనాల పెంపులో భాగంగా బ్యాటరీల తయారీకి ప్రోత్సాహకాలు.
స్టార్టప్ లకు పన్ను మినహాయింపు మరో ఏడాది పొడిగింపు.
సహకార సంస్థల పన్ను 15 శాతానికి తగ్గింపు.
సహకార సంస్థల పన్నుపై సర్ఛార్జీ 7 శాతానికి తగ్గింపు.
కొత్తగా ఏర్పాటయ్యే దేశీయ తయారీ సంస్థలకు పన్ను మినహాయింపు.
రైల్వేలో సరకుల రవాణాకు సరికొత్త పథకం.
కృష్ణా-గోదావరి, కృష్ణా-పెన్నా ప్రాజెక్టులకు డీపీఆర్ సిద్దం.
ఐదు నదులకు చెందిన ప్రాజెక్టుల నీటి పంపకాలకు డీపీఆర్ సిద్ధమైంది.
రూ. 44,605 కోట్లతో కేన్-బేట్వా నదుల అనుసంధానం.
సోలార్ ఎనర్జీ ఉత్పత్తి కోసం రూ. 19,500 కోట్లు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్పీఎస్ (నేషనల్ పెన్షన్ స్కీమ్).
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్పీఎస్ మినహాయింపు 14 శాతం పెంచుకునే అవకాశం.
గంగా తీరంలో 5 కిలోమీటర్ల మేర సేంద్రియ సాగు.
వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలకు ప్రత్యేక స్టార్టప్ లు.
ప్రతి రాష్ట్రంలో కొన్ని ప్రత్యేక ఐటీఐల్లో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు.
పీపీపీ మోడల్ లో ఆహార శుద్ధి పరిశ్రమలకు ప్రోత్సాహం.
డ్రోన్ల సాయంతో పంట పొలాల పరీక్షలు.
వ్యవసాయ యూనివర్శిటీల సిలబస్ లో మార్పులు చేస్తాం.
దమన్ గంగా - పీర్ పంజాల్, పర్ తాపీ - నర్మదా, గోదావరి - కృష్ణా- పెన్నా- కావేరీ నదుల అనుసంధానం  
విద్యా సంస్థలు, పరిశోధనా సంస్థలు, ప్రభుత్వ సంస్థల అనుసంధానం.
ప్రైవేట్ రంగంలో అడవుల పెంపకం కోసం పథకం.
ఉత్తర సరిహద్దుల్లో గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేక పథకం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles