పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2022-2023 వార్షిక ఆర్థిక బడ్జెట్ నేపథ్యంలో దిగుమతి చేసుకునే వస్తువులపై భారం పెరగనుంది. క్రిప్టో కరెన్సీ కూడా చౌకగానే అందుబాటులోకి రానుండగా, క్రిప్టో కరెన్సీ ప్లేయర్ లపై మాత్రం 30 శాతం పన్నులతో వాయింపు పడనుంది. అయితే దేశ ప్రజలందరూ వినియోగిస్తున్న స్మార్ట్ ఫోన్ ధరలు మాత్రం చౌకగా మారనున్నాయి. కేంద్ర బడ్జెట్ను సీతారామన్ వరుసగా నాలుగో పర్యాయం దేశ ఆర్థికశాఖ మంత్రి హోదాలో ప్రవేశపెట్టిన బడ్జెట్ తో వచ్చే ఆర్థిక సంవత్సరంలో అనేక రకాల వస్తువులు చౌకగా లభ్యం కానున్నాయి. మరికొన్ని వస్తువులు ప్రియం కానున్నాయి. కొన్నింటిపై కస్టమ్ సుంకం తగ్గించగా, కొన్నింటిపై కస్టమ్ సుంకం పెంచారు. ఈ బడ్జెట్ ద్వారా ధరలు తగ్గేవి, పెరిగేవి ఏమిటంటే...
ధరలు పెరిగేవి...
* అనేక రకాల దిగుమతి వస్తువులు
* విదేశీ గొడుగులు
* క్రిప్టో లావాదేవీలు
* అన్ బ్లెండెడ్ పెట్రోల్
* అన్ బ్లెండెడ్ డీజిల్
* ఇమిటేషన్ (రోల్డ్ గోల్ట్) ఆభరణాలు
* లౌడ్ స్పీకర్లు
* హెడ్ఫోన్లు, ఇయర్ఫోన్లు
* స్మార్ట్ మీటర్లు
* సోలార్ సెల్స్
* సోలార్ మాడ్యూల్స్
* ఎక్స్-రే యంత్రాలు
* ఎలక్ట్రానిక్ బొమ్మల భాగాలు
చౌకగా లభించనున్న వస్తువులివే..
* బట్టలు
* రత్నాలు మరియు వజ్రాలు
* సెల్యులార్ మొబైల్ ఫోన్ కెమెరా లెన్స్
* మొబైల్ ఫోన్లు
* మొబైల్ ఫోన్ ఛార్జర్లు
* ప్రోజెన్ మస్సెల్స్
* ప్రోజెన్ స్క్విడ్లు
* ఇంగువ
* కోకో బీన్స్
* మిథైల్ ఆల్కహాల్
* ఎసిటిక్ యాసిడ్
* పెట్రోలియం ఉత్పత్తులకు అవసరమైన రసాయనాలు
* స్టీల్ స్క్రాప్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more