Gravton Motors launches first electric bike గ్రావ్ట‌న్ మోటార్స్ నుంచి క్వాంటా ‘మేడ్ ఇన్ తెలంగాణ’ ఈవీ బైక్స్..

Gravton motors builds first ever made in telangana electric bike with swappable batteries

Quanta electric vehicle, EV, electric vehicle, Quanta, Gravton Motors, Made in Telangana, EV with swappable batteries, greenfield unit, Kanyakumari, Khardung La (Ladakh), Asia Book of Records, Hyderabad, Telangana

Hyderabad-based Electric Vehicle (EV) maker Gravton Motors has developed the first ever completely ‘Made in Telangana’ EV with swappable batteries, under the brand Quanta. According to Gravton Motors, the Quanta electric vehicle was founded on the idea that the EV can contribute to sustainable living if it comes at the convenience and ease of using fossil fuel driven vehicles.

గ్రావ్ట‌న్ మోటార్స్ నుంచి క్వాంటా ‘మేడ్ ఇన్ తెలంగాణ’ ఈవీ బైక్స్..

Posted: 02/04/2022 03:24 PM IST
Gravton motors builds first ever made in telangana electric bike with swappable batteries

హైద‌రాబాద్‌కు చెందిన స్టార్ట‌ప్ కంపెనీ గ్రావ్ట‌న్ మోటార్స్ ప్ర‌యివేటు లిమిటెడ్ కంపెనీ బృందానికి రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ కేటీఆర్ అభినంద‌న‌లు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఈ కంపెనీ తెలంగాణ‌లోనే తొలి ఎల‌క్ట్రిక్ బైక్‌ను రూపొందించి ఇటీవ‌ల విడుద‌ల చేసింది. ఈ సంద‌ర్భంగా ఆ బృందాన్ని అభినందించారు. అయితే ఎల‌క్ట్రిక్ బైక్ రూపొందించిన కోర్ టీమ్‌లో త‌మ సిరిసిల్ల కుర్రాళ్లు ఉన్నార‌ని చెప్పడానికి గ‌ర్వ‌ప‌డుతున్నాన‌ని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ బైక్‌పై క‌న్యాకుమారి నుంచి ల‌డ‌ఖ్‌లోని ఖ‌ర్దుంగ్ లా వ‌ర‌కు నాన్‌స్టాప్‌గా రైడ్ చేసి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకుంది. కేవలం 164 గంటల వ్యవధిలో ఈ 4012 కిలోమీటర్ల దూరాన్ని ఈ బైక్ నిర్వారామంగా చేరుకోగలిగింది.

అయితే మనాలిలో మాత్రమే ఈ బృందం రాత్రి పూట వాతావరణం అనుకూలించకపోవడంతో విశ్రాంతి తీసుకుంది. ఈ క్ర‌మంలో గ్రావ్ట‌న్ మోటార్స్ కంపెనీ ప్ర‌తినిధుల‌కు కేటీఆర్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. క్వాంటా పేరుతో మార్కెట్లోకి ప్రవేశపెట్టిన ఈ బైక్ కేవలం రూ.80 ఖర్చుతో 800 కిలోమీటర్ల మైలేజి ఇవ్వగలదని కంపెనీ ఇటీవ‌ల వెల్లడించింది. ప్రమోషనల్‌ ఆఫర్‌గా ధరను రూ.99,000గా నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది. తెలంగాణ ప్రభుత్వపు ‘గో ఎలక్ట్రిక్‌’ ప్లాట్‌ఫామ్‌లో క్వాంటాను రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్‌ చేతుల మీదుగా ఆవిష్కరింపచేసినట్లు గ్రావ్టన్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ పరశురామ్‌ పాకా తెలిపారు.  

క్వాంటా ఈవీ బైక్ ప్ర‌త్యేక‌త‌లు..

రూ.80కే.. 800 కిలోమీటర్ల ప్రయాణం
బీఎల్‌డీసీ మోటర్‌తో గరిష్ఠంగా గంటకు 70 కిలోమీటర్ల వేగం
ఒక్కసారి ఛార్జ్‌చేస్తే 150 కిలోమీటర్ల ప్రయాణం, 320 కిలోమీటర్ల వరకూ పెరిగే అవకాశం
ఫాస్ట్‌ ఛార్జింగ్‌ మోడ్‌లో 90 నిముషాల్లో బ్యాటరీ ఛార్జింగ్‌
బ్యాటరీకి 5 ఏండ్ల వారెంటీ
రోడ్‌సైడ్‌ అసిస్టెన్స్‌, మ్యాపింగ్‌ సర్వీస్‌ స్టేషన్స్‌,రిమోట్‌ లాక్‌/ఆన్‌లాక్‌ ఫీచర్లతో స్మార్ట్‌ యాప్‌
మూడు రంగుల్లో లభ్యమయ్యే ఈ బైక్‌ను కంపెనీ వెబ్‌సైట్‌లో బుక్‌ చేసుకోవచ్చు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles