రైలు ప్రయాణాలు ఎంత ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని అందిస్తాయో అదే రీతిలో రైలు ఎక్కేప్పుడు, దిగేప్పుడు అప్రమత్తంగా లేకపోతే అంతీ భీతిగోలుపుతాయి. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలు అనేకం రైల్వేస్టేషన్లలోని సిసిటీవీ కెమెరాల్లో నిక్షిఫ్తం కావడంతో వాటిని తమ అధికారిక సామాజిక మాధ్యమాల ఖాతాల్లో పెట్టి.. రైలు ప్రయాణికులను అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకుంటోంది రైల్వేశాఖ. అయినా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటునే వున్నాయి. తాజాగా రన్నింగ్ రైలులో నుంచి దిగుతూ కిందపడిపోయిన ప్రయాణికుడిని రైల్వే భద్రతా సిబ్బంది అప్రమత్తత కాపాడింది.
ఈ ఘటన వరంగల్ రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాం 1లో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. వరంగల్ ఆర్పీఎఫ్ సీఐ టీఎస్ఆర్ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్ రాష్ట్రం జహనాబాద్‌కు చెందిన ప్రధూమ్‌కుమార్(22) వరంగల్‌లోని బాలాజీ రైస్ మిల్లులో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం వరంగల్ నుంచి సూరత్ వెళ్లుటకు టికెట్ తీసుకుని నవజీవన్ ఎక్స్‌ప్రెస్ రైలు కోసం ప్లాట్‌ఫాం నంబర్ 1లో వేచియున్నాడు. ఈ క్రమంలో సాయంత్రం 6.30 గంటల సమయంలో సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్లే శాతవాహన ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫాం 1నకు వచ్చింది. హడావిడిగా అది ఏ రైలో తెలుసుకోకుండా ప్రధూమ్‌కుమార్ శాతవాహన ఎక్స్‌ప్రెస్ ఎక్కాడు.
అది కదిలి స్పీడుగా వెళ్తున్న క్రమంలో నవజీవన్ ఎక్స్‌ప్రెస్ కాదని తెలుసుకుని వెంటనే దిగే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ప్లాట్‌ఫాం, రైలు బోగీల మధ్యన ఉండే ఖాళీ ప్రదేశంలో పడబోయాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న వరంగల్ ఆర్పీఎఫ్ ఏఎస్ఐ ఎంవీ రావు, హోంగార్డు ఆమిరిశెట్టి మహేష్‌లు గమనించి వెంటనే అప్రమత్తమై ప్రధూమ్‌కుమార్‌ను పట్టుకుని బయటకు లాగారు. దాంతో ఆయన ప్రాణాలతో బయట పడ్డాడు. ఇదంతా రెప్పపాటు సమయంలో జరిగింది. దీన్ని చూసిన ప్రతి ఒక్కరూ భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు కాపాడిన ఆర్పీఎఫ్ సిబ్బందిని ప్రయాణికులు, అధికారులు అభినందించారు.
Today, on 08.02.2022, Sri M.V.Rao, ASI/RPF/WL and homeguard rescued a man who was falling from a running train at Warangal Railway station.
— Rebal Ravi (@RebalRavi4) February 8, 2022
Great job sir, Jaihind... pic.twitter.com/FtIZdGX2T7
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more