శివసేన రాజ్యసభ సభ్యుడు, అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ సంచలన అరోపణలు చేశారు. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహావికాస్ అఘాడి (ఎంవీఎస్) ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కుట్ర జరుగుతోందని అన్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సాయం కావాలంటూ కొందరు వ్యక్తులు తననే సంప్రదించారని, కలసి రాకుంటే జైలుకు పంపుతామని బెదిరించారని ఆరోపించారు. మహారాష్ట్రలోని ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ఇన్నాళ్లు ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన బీజేపి.. ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేసిందని.. అయితే అవి సాధ్యంకాకపోవడంతో ఇప్పుడు మరో రకంగా ప్రణాళికను రచిస్తోందని ఆయన అరోపించారు.
ఇన్నాళ్లు శరద్ పవార్ ను టార్గెట్ చేసిన బీజేపి సహా కేంద్రంలోని సెంట్రల్ ఏజెన్సీలు ఇక ఇప్పుడ తనను, థాకరే కుటుంబాలను కూడా లక్ష్యంగా చేసుకుని ప్రణాళికలు రచిస్తున్నాయని ఆయన అరోపించారు. అయితే ఇప్పుడు ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఏకంగా ముఖ్యనేతలనే టార్గెట్ చేశారని ఆయన అరోపించారు. సాయం చేసేందుకు తాను నిరాకరించడంతో బెదిరింపుల పర్వానికి దిగుతున్నారని కూడా ఆయన అరోపించారు. రైల్వే మాజీమంత్రిలా కొన్ని సంవత్సరాలపాటు జైలు జీవితం గడపాల్సి ఉంటుందని తనను హెచ్చరించారని అన్నారు. ఈ బెదిరింపుల విషయాలన్నీ పేర్కొంటూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడికి ఆయన ఫిర్యాదు చేశారు.
ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఈడీ వంటి సంస్థలను వాడుతున్నారని ఆరోపించారు. ఫిర్యాదు లేఖ ప్రతులను తమ కూటమిభాగస్వామ్య పక్షాలకు కూడా సంజయ్ రౌత్ పంపించారు. అంతేకాదు, ఇదే విషయాన్ని ట్విట్టర్లోనూ షేర్ చేశారు. ఝకేంగే నహీ.. జై మహారాష్ట్ర (తగ్గేదే లేదు.. జై మహారాష్ట్ర) అని క్యాప్షన్ తగిలించారు. తమ కూటమి ప్రభుత్వం ఐదేళ్లూ కొనసాగుతుందని రౌత్ ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు, ఈ లేఖ ట్రైలర్ మాత్రమేనని, బీజేపీతో కలిసి ఈడీ అధికారులు క్రిమినల్ సిండికేట్గా ఎలా మారారో కూడా బయట పెడతానని రౌత్ పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more