తెలంగాణ ఆర్టీసీలోకి మరో కొత్త ఎలక్ట్రిక్ బస్సు వచ్చింది. ఇంతకుముందుగానే ఎలక్ట్రిక్ బస్సులు వున్నాయిగా.. ఈ బస్సులో ఏమీటీ ప్రత్యేకత అంటారా.. అయితే ఇది కొత్త ఎలక్ట్రిక్ బస్సే కానీ.. అంతకుముందు సిటీరోడ్లపై డీజిల్ ఇంధనంతో పరుగులు పెట్టిన బస్సు కావడం గమనార్హం. దీనిని డీజిల్ ఇంధనం నుంచి నూటికి నూరుపాళ్లు ఎలక్ట్రిక్ బస్సుగా మార్చేశారు. డీజిల్ భారం నుంచి బయటపడేందుకు ఆర్టీసీ చేస్తున్న ప్రయోగంలో భాగంగా రూపుదిద్దుకున్న ఈ బస్సు అంతకుముందు డీజిల్‌తో నడిచినా.. తాజాగా మాత్రం ఎలక్ట్రిక్ బస్సుగా మారింది.
హైదరాబాద్‌లోని ముషీరాబాద్ డిపోకు చేందిన ఈ బస్సు కొత్త ఇంధనం రూపురేకలతో శుక్రవారం సాయంత్రం తిరిగి ఢిపోకు చేరుకుంది. అయితే సిటీ రోడ్లపై పరుగులు తీయాల్సిన ఈ బస్సు ఎంత మేరకు ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుందన్ని అన్న కోణంలో దీనిపై అధ్యయనం చేయనున్నారు. ఇది ఎంత వరకు ఉపయోగపడుతుంది, డీజిల్‌తో పోలిస్తే ఎంత ఆదా చేస్తుంది, నిర్వహణ వ్యయం ఎంత తగ్గుతుంది, ట్రాఫిక్ రద్దీలో ఎలా నడుస్తుందన్న అంశాలను బేరీజు వేసుకుని మరిన్ని బస్సులను ఎలక్ట్రిక్‌గా మార్చే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం నగరంలో 40 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. అయితే అవి కేవలం విమానాశ్రయానికి వచ్చిపోయే వారికే సేవలందిస్తున్నాయి.
వాటికి భిన్నంగా ఈ బస్సు సాధారణ ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది. ఆర్టీసీ ప్రస్తుతం తీవ్ర నష్టాల్లో ఉంది. జీతాల తర్వాత అంత భారీ వ్యయం డీజిల్ కోసం అవుతోంది. ఒక్కో బస్సుకు కి.మీ.కు రూ.20 వరకు ఖర్చు అవుతోంది. జీతాలను తగ్గించుకోవటం సాధ్యం కాదు. కానీ డీజిల్ ఖర్చును తగ్గించుకునే వెసులుబాటు ఉండటంతో ఆర్టీసీ ఆ దిశగా యోచిస్తోంది. ఈ క్రమంలోనే ఎలక్ట్రిక్ బస్సుల వైపు మొగ్గు చూపింది. ఎలక్ట్రిక్ బస్సుకు కి.మీ.కు కేవలం రూ.6 మాత్రమే ఖర్చు అవుతుంది. అంటే డీజిల్ బస్సుతో పోల్చితే ప్రతి కి.మీ.పై రూ.14కు పైగా మిగులుతుందన్నమాట. కానీ ఒక్కో కొత్త ఎలక్ట్రిక్ బస్సు ధర రూ.కోటిన్నర పైమాటే.
అంత వ్యయంతో ఎలక్ట్రిక్ బస్సులు కొనే పరిస్థితి లేదు. దీంతో ఇప్పటికే ఉన్న డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్పిడి (కన్వర్షన్) చేసేందుకు ఉన్న అవకాశాన్ని సంస్థ పరిగణనలోకి తీసుకుంది. ఇందుకు ఒక్కో బస్సుకు రూ.65 లక్షల వరకు మాత్రమే ఖర్చవుతుండటం కూడా ఆర్టీసీని ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ కేంద్రంగా ఎలక్ట్రిక్ రైలు లోకోమోటివ్‌లు తయారు చేసే ఓ సంస్థను సంప్రదించింది. ఆ సంస్థ అంగీకరించడంతో ముషీరాబాద్–2 డిపోకు చెందిన ఓ డీజిల్ బస్సును ఇవ్వగా దాన్ని ఎలక్ట్రిక్ బస్సుగా కన్వర్ట్ చేసిన సదరు సంస్థ శుక్రవారం ఆర్టీసీకి అప్పగించింది. దీంతో దాని పనితీరును నెల రోజుల పాటు పరిశీలించేందుకు ఆర్టీసీ సిద్ధమైంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more