Bijapur encounter: CRPF officer killed, jawan injured మావోల కాల్పుల్లో.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండర్ మృతి

Crpf officer killed jawan injured in naxal encounter in chhattisgarh s bijapur district

CRPF personnel killed, CRPF personnel injured, Chhattisgarh Naxal encounter, Bijapur Naxal encounter, CRPF, maoist encounter, naxal, crpf encounter, maoists, Naxal encounter death toll, Naxal encounter latest news updates, bastar, bijapur, chhattisgarh, crime

A Central Reserve Police Force (CRPF) officer was killed and a jawan injured in an exchange of fire with Naxals in Chhattisgarh's left-wing extremism affected Bijapur district on Saturday, officials said. IG (Bastar range) Sundarraj P said that the incident took place around 9:30 am near a rivulet close to Putkel village under Basaguda police station limits when a team of CRPF's 168th battalion was out on a road security duty.

ఛత్తీస్ గఢ్: మావోల ఎదురుకాల్పుల్లో.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండర్ మృతి

Posted: 02/12/2022 03:47 PM IST
Crpf officer killed jawan injured in naxal encounter in chhattisgarh s bijapur district

ఛత్తీస్‌గడ్‌ లో మావోయిస్టులను ఈ మధ్యకాలంలో పోలీసు దళాలు బాగానే టార్గెట్ చేస్తున్నాయి. ఈ రాష్ట్రంలోని మావోయిస్టులు ఇప్పటికే పలువురు అరెస్టు కాగా, మరికొందరు లొంగిపోతున్నారు. చత్తీస్ గఢ్ లోని దండకారణ్యంలో తిష్టవేసిన మావోయిస్టులను ఎప్పటికప్పుడు ఏరి పారేయడంలో పోలీసులు నిమగ్నమయ్యారు. కాగా, తాజాగా బీజాపుర్ జిల్లాలో పోలీసులకు మావోలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఇరువర్గాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో.. పోలీసులు బలగాల్లో విషాదం చోటుచేసుకుంది.

మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో సీఆర్‌పీఎఫ్ అసిస్టెంట్​ కమాండెంట్​ అధికారి ప్రాణాలు కోల్పోయారు. మరో జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. బసగుడా పోలీస్ స్టేషన్ పరిధిలోని పుట్‌కేల్ గ్రామ సమీపంలో ఇవాళ ఉదయం 9.30 గంటల సమయంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. డొంగల్ చింతానది సమీపంలోని అటవీ ప్రాంతంలో రహదారి భద్రతా విధులు నిర్వహిస్తున్న సీఆర్‌పీఎఫ్ 168 బెటాలియన్ సిబ్బంది పైకి మావోయిస్టులు కాల్పులకు పాల్పడినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎదురుకాల్పులు జరగ్గా కాల్పుల్లో అసిస్టెంట్ కమాండెంట్ శాంతి భూషణ్ టిర్కీ తీవ్రంగా గాయపడ్డారు.

అసుపత్రికి తరలిస్తుండగా ఆయన మార్గమధ్యలోనే మృతిచెందారు. ఆయన జార్ఖండ్‌కు చెందినవారని పోలీసులు తెలిపారు. ఇక మరో సిఆర్పీఎఫ్ జవాను అప్పారావు కూడా మావోయిస్టుల కాల్పుల్లో గాయపడినట్లు వెల్లడించారు. క్షతగాత్రుణ్ని ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. కాల్పులు జరుపుతూనే మావోయిస్టులు అక్కడి నుంచి దట్టమైన అటవీ ప్రాంతంలోకి తప్పించుకున్నారని చెప్పారు. వారికోసం గాలింపు కొనసాగుతున్నదని బీజాపూర్ ఎస్పీ కమలోచన్ కశ్యప్ వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles