సోషల్ మీడియాలో ఆసక్తికరమైన, అద్భుతమైన విషయాలను పంచుకోవడంలో మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ సంస్థల చైర్మన్, దిగ్గజ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఎప్పుడు ముందుంటారు. పంచుకోవడమే కాదు అవసరం అయితే సహకరం కూడా అందిస్తుంటాడు ఆయన. ఇటీవల ఐఐటీ చెన్నైకి చెందిన విద్యార్థుల సృజనాత్మకతకు ముగ్దుడైన ఆయన వారి 3డి ప్రింటింగ్ ఇళ్లు నిర్మాణం సంస్థలో తనను చేర్చుకోవాలని అభ్యర్థించారు. ఇలా టాలెంట్ ఉన్నవారిని నిత్యం ప్రోత్సహించడం ఆయనకు సొంతం. తనకు నచ్చితే ప్రోత్సహించి వెన్నుతట్టడం ఆయనలోని మంచితత్వం.
తాజాగా అలాంటి టాలెంట్ తో ఓ వ్యక్తి రూపోందించిన డివైజ్ మహీంద్రా మనస్సును దోచింది. అంతే ఆయనకు అండగా నిలిచారు ఆనంద్ మహింద్రా... ఇప్పుడు మార్కెట్ లోకి ఎలక్ట్రిక్ వాహనాల ఇన్నోవేషన్స్ రోజుకోటి వస్తోంది కానీ సైకిల్ కి ఉన్న ఆదరణ ఇంకా తగ్గలేదు. ఇప్పటికి దేశంలో 53 శాతం మంది ప్రజలు సైకిల్ ని తమ వాహనంగా వాడుతున్నారు. అయితే వాడుతున్న సైకిల్‌కి పెద్దగా ఆల్ట్రేషన్ చేయకుండానే ఈవీ వెహికల్‌గా మార్చే అద్భుతమైన డివైజ్‌ని గురు సౌరభ్ తయారు చేశారు. దీనికి సంబంధించిన వీడియోని అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది కాస్త వైరల్ గా మారడంతో ఆనంద్ మహింద్రా దృష్టిని ఆకర్షించింది.
అందుకే ఆనంద్ మహీంద్రా అతనికి అండగా ఉండేందుకు ముందుకు వచ్చాడు. గురు సౌరభ్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తానంటూ తనంతట తానుగా ప్రకటించాడు. గురు సౌరభ్ రూపొందించిన డివైజ్‌తో వీడియో చేసి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఈ సింపుల్ డివైజ్‌తో సైకిల్ ఈవీ వెహికల్‌గా మారిపోతుంది. 170 కేజీ బరువు మోసుకెళ్లగలుతుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 40 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఫైర్ , వాటర్, మడ్ ప్రూఫ్ కూడా. 20 నిమిషాల పాటు పెడల్స్ తొక్కితే దీని బ్యాటరీ 50 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఇలా ప్రతీ అంశం వివరించడం కంటే మీరే ఆ వీడియో చూడండి.. తప్పకుండా మీకు నచ్చుతుంది.
It’s not inevitable that this will succeed commercially or be substantially profitable, but I still would feel proud to be an investor…Grateful if someone can connect me with Gursaurabh, (3/3) pic.twitter.com/GsuzgJECTo
— anand mahindra (@anandmahindra) February 12, 2022
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more