వివాహేతర సంబంధాన్ని "అనైతిక చర్య"గా పేర్కోన్నప్పటికీ, దానిని "దుష్ప్రవర్తన"గా పరిగణించలేమని గుజరాత్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు కానిస్టేబుల్ తన కుటుంబంతో కలిసి నివసించే పోలీస్ హెడ్ క్వార్టర్‌లోనే వితంతువుతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నందుకు తనను సర్వీస్ నుంచి తొలగించడంతో అతను సవాలు చేస్తూ ఒక పిటిషన్‌ను దాఖలు చేశాడు. ఈ కేసును విచారించిన గుజరాత్ రాష్ట్రోన్నత న్యాయస్థానం.. కానిస్టేబుల్ కు సానుకూలంగా తీర్పును వెలువరించింది. దీంతో అతనికి తిరిగి ఉద్యోగంలో చేర్చుకోవాలని అదేశాలను కూడా జారీ చేసింది.
ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్లే ముందు న్యాయస్థానం తన తీర్పులో పలు అంశాలను ప్రస్తావించింది. ఆ తీర్పు ప్రకారం "అయితే పిటిషనర్ క్రమశిక్షణలో భాగంగా వివాహేతర సంబంధం దుష్ప్రవర్తనే. సమాజం దృష్టిలో కూడా వివాహేతర సంబంధం అనైతిక చర్యే అయినప్పటికీ వాస్తవాన్ని పరిగణలోకి తీసుకుంటే దుష్ప్రవర్తన పరిధిలోకి తీసుకురావడం ఈ కోర్టుకు కష్టమవుతుంది. ఎందుకంటే ఇది అతని వ్యక్తిగత వ్యవహారమని బలవంతపు ఒత్తిళ్లు లేదా దోపిడీ ఫలితంగా కాదు అని" కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతేకాదు ప్రవర్తనా నియమాలు 1971 ప్రకారం దుష్ప్రవర్తన పరిధిలోకి తీసుకురాలేం అని కోర్టు స్పష్టం చేసింది.
అంతేకాదు అతన్ని ఒక నెలలోపు తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, అతను విధుల నుంచి తొలగించబడినప్పటి నుంచి అతని వేతనంలో 25 శాతం చెల్లించాలని జస్టిస్ సంగీతా విషెన్ సంచలన తీర్పు వెలువరించారు. మరోవైపు కానిస్టేబుల్ తన అభ్యర్థనలో సంబంధం ఏకాభిప్రాయమని, తమ స్వంత ఇష్టపూర్వకంగా జరిగిందని వాదించాడు. అంతేకాదు పోలీసు డిపార్ట్మెంట్ సరైన విచారణ ప్రక్రియను అనుసరించలేదని, తనను తొలగిస్తూ వచ్చిన ఉత్తర్వులను రద్దు చేసి పక్కన పెట్టిందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు సదరు మహిళతో కానిస్టేబుల్ అక్రమ సంబంధానికి సంబంధించిన సీసీఫుటేజ్‌ని 2012లో నగర పోలీసు ఉన్నతాధికారులకు అందించి మరీ వితంతువు కుటుంబం అతని పై ఫిర్యాదు చేసింది.
దీంతో పోలీసులు అతనికి షోకాజ్ నోటీసులు పంపారు. ఆజంట కూడా సంబంధాన్ని అంగీకరించడంతో పోలీసులు విచారణ చేయడం ఇరు పార్టీలను ఇబ్బందిపెట్టడమే అవుతుందని భావించి పూర్తి విచారణ జరపలేదు. ఆ తర్వాత జాయింట్ పోలీస్ కమీషనర్ అతను డిపార్ట్మెంట్లో కొనసాగితే ప్రజలకు పోలీస్‌శాఖ పై విశ్వాసం సన్నగిల్లుతుందంటూ 2013లో అతన్ని విధుల నుంచి తొలగించారు. న్యాయస్థానం తమ తీర్పులో కానిస్టేబుల్ ను విధుల నుంచి తొలగించడానికి ఇది కారణం కాకుడదని పేర్కోంది. పోలీసు సర్వీస్ నిబంధనల చట్టం ప్రకారం ఇది చెల్లనేరదని.. కానిస్టేబుల్ ను విధుల్లో చేర్చుకోవడంతో పాటు అతడ్ని తొలగించిన కాలానికి గాను అతినిక 25శాతం జీతబెత్యాన్ని కూడా జమకట్టి ఇవ్వాలని అదేశఇంచింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more