Congress sleepover dharna in Karnataka Assembly కర్ణాటక అసెంబ్లీలో నిద్రించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..

Congress mlas protest in karnataka assembly over eshwarappa s saffron flag remark

karnataka assembly, Congress MLAs in Karnataka, congress protest karnataka assembly, karnataka legislative assembly, K S Eshwarappa, congress MLAs, saffron flag row in karnataka, KS Eshwarappa, Congress MLAs, congress protest, Red fort, national flag, saffron flag row,Karnataka, Politics

Congress legislators have said they will spend the night inside the Karnataka assembly on Thursday, demanding the sacking of minister KS Eshwarappa and a sedition case against him for his hugely controversial comment about replacing the national flag with a saffron one.

కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల నిద్ర.. ఆ మంత్రిపై చర్యలకు డిమాండ్.!

Posted: 02/18/2022 01:42 PM IST
Congress mlas protest in karnataka assembly over eshwarappa s saffron flag remark

కర్ణాటకలో రాజకీయ పార్టీల మధ్య ఆసక్తికర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. జాతీయ జెండాను ఉద్దేశించి కర్ణాటక సీనియర్ బీజేపి నేత, మంత్రి కేఎస్ ఈశ్వరప్ప చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ఈ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. కాగా దీనిపై ప్రభుత్వవర్గాల నుంచి ఎలాంటి స్పందన లభించకపోవడంతో లెజిస్లేటివ్ అసెంబ్లీలో.. రాత్రి వేళ పడుకుని తమ నిరసన వ్యక్తం చేశారు కాంగ్రెస్ సభ్యులు.

జాతీయ జెండాను ఉద్దేశించి కర్ణాటక మంత్రి కేఎస్ ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో పెను దుమారాన్ని రేపుతున్నాయి. అయితే మంత్రి కేఎస్ ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలను కర్ణటాక మంత్రి బస్వరాజ్ బొమ్మై సహా మిగతా మంత్రులంతా సమర్ధించారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే. ‘‘ఏదో ఒక రోజు ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాకు బదులు  కాషాయ జెండా ఎగురుతుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయగా, అందుకు బదులు మంత్రి వ్యాఖ్యలను మంత్రులతో పాటు ముఖ్యమంత్రి సమర్ధించడంతో కాంగ్రెస్ సభ్యులు నిరసన తెలపాలని నిర్ణయించారు.

దీంతో గురువారం రాత్రి అనూహ్యంగా అసెంబ్లీలో నిరసనకు దిగారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య, ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు డీ శివకుమార్‌తో సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో బైఠాయించారు. అసెంబ్లీలోనే ఈశ్వరప్ప వ్యాఖ్యలకు నిరసన తెలిపారు. రాత్రి వేళ అక్కడే నిద్రించిన కాంగ్రెస్ సభ్యులు ఉదయమే లేచారు. అయితే గురువారం రాత్రి కాంగ్రెస్ సభ్యులు అసెంబ్లీలోనే నిరసన తెలుపుతున్నారని తెలుసుకున్న సీఎం.. సీఎం బసవరాజ్ బొమ్మై, మాజీ సీఎం బీఎస్ యెడియూరప్ప, అసెంబ్లీ స్పీకర్, కొందరు మంత్రులు వెంటనే అసెంబ్లీకి చేరుకున్నారు.

కాంగ్రెస్​ పక్ష నేత సిద్ధరామయ్యతో గంటకు పైగా చర్చలు జరిపినా ఫలించలేదు. కాంగ్రెస్‌ నేతలకు నచ్చజెప్పి నిరసనను విరమింపజేసేందుకు ప్రయత్నించారు. అయితే కాంగ్రెస్ సభ్యులు ససేమిరా అన్నారు. మంత్రి కేఎస్‌ ఈశ్వరప్పపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అయితే సీఎం వినతి మేరకు ప్రభుత్వం పంపించిన బోజనాలు చేసేందుకు అంగీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నిరసనను విరమించుకోవాలని కాంగ్రెస్ సభ్యులను ఒప్పించేందుకు శతవిధాలా ప్రయత్నం చేశామని, అసెంబ్లీలో నిద్రపోవద్దని చెప్పామని, కానీ వాళ్లు అంగీకరించలేదని, రేపు మరో పర్యాయం వారితో చర్చలు నిర్వహిస్తామని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles