నాలుగు శతాబ్దాల హైదారబాద్ మహానగరానికి మణిమకుటంగా బాసిల్లుతున్న చారిత్రక సంపద చార్మినార్ పై సామాజిక మాద్యమాల్లో తప్పుడు ప్రచారం జరగడంపై అధికారులు స్పందించారు. నెటిజనులు ఈ తప్పుడు వార్తలను ప్రచారం చేసిన నేపథ్యంలో వారిపై చర్యలు తీసుకోబడతాయని అధికారులు హెచ్చరించారు. చారిత్రక కట్టడం చార్మినార్ ఎలాంటి ప్రకృతి విపత్తులకు కూడా చెక్కుచెదరకుండా చర్యలు తీసుకున్నామని.. అంతేకానీ సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను ఎవర్వూ నమ్మవద్దని రాష్ట్ర పరావస్తు శాఖ అధికారులు ప్రజలను కోరారు.
అపురూప చారిత్రక కట్టడం పిడుగు పాటుతో పాటు ఇతర ప్రకృతి విపత్తులతో ఎలాంటి నష్టం వాటిల్లకుండా.. విపత్తులను సైతం ఎదర్కోనే దిశగా కేంద్ర పురావస్తు శాఖ (ఏఎస్ఐ) అదేశాల మేరకు రక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు హైదరాబాద్ సర్కిల్ పురావస్తు శాఖ డైరెక్టర్ స్మిత కుమార్ తెలిపారు. ఇందులో భాగంగా చార్మినార్ వద్ద లైటనింగ్ కండక్టర్ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అయితే ఈ మేరకు పనులు జరుగుతున్న క్రమంలో గతంలో తమ శాఖ నిర్మించిన అప్రాన్ స్లాబ్ కూలిందని పేర్కోన్నారు. దానిని కూడా తమ శాఖ అధ్వర్యంలో మళ్లి పునరుద్దరిస్తామని చెప్పారు.
దేశవ్యాప్తంగా ఉన్న చారిత్రక, వారసత్వ సంపదను పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్న ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. చార్మినార్ అంతర్భాగంలో ఎలక్ట్రికల్ కండక్టర్ల ఏర్పాటు కోసం గోతుల తవ్వకాలు చేపట్టింది. సమాచార లోపం కారణంగా స్థానికులు అందోళనకు దిగారు. వారికి విషయాన్ని చెప్పిన తరువాత.. సొరంగాల తవ్వకాలు జరుపుతున్నారని.. చార్మినార్ కట్టడాన్ని బలహీన పరుస్తున్నారని కోందరు, ఇక్కడ నుంచి గోల్కొండకు రహస్య స్వరంగం బయటపడిందని మరికొందరు.. చార్మినార్ లోపల దిగుడు బావి కనుగోన్నారని ఇంకోందరు సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని అమె అన్నారు.
చార్మినార్ కట్టడం పరిరక్షణలో భాగంగా నాలుగు మినార్లతో పాటు మరిన్ని అంతర్గత నిర్మాణాలకు ప్రకృతి పరంగా, ఇతర ప్రమాదాల కారణంగా నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టామని స్మిత తెలిపారు. అయితే తప్పుడు సమాచారం ప్రచారం జరగడం వల్ల ఏం జరుగుతుందో తెలియని అనేక మంది ఇక్కడకు చేరుకోవడంతో తమ పనులకు ఆటంకం కలుగుతుందని అన్నారు. ఇలాంటి సమాచారం ప్రచారం చేసేవారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆర్కియాలజీ శాఖపరంగా పనులు చేపడుతున్నామని, అయితే తవ్వకాల విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని, కట్టడాన్ని పరిరక్షించేందుకే ఈ చర్యలు తీసుకుంటామని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more