పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణముల్ కాంగ్రెస్(టీఎంసీ), బీజేపీ పార్టీల మధ్య ఎన్నికల వేడి ఇంకా తగ్గలేదు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో చతికిల పడ్డ బీజేపి.. కేంద్రంలో తమ ప్రభుత్వం ఉందన్న ధీమాతో తృణముల్ తో ధీటుగా, ధాటిగానే ఢీకొంటోంది. అయితే తృణముల్ మాత్రం తనకు ఎదురులేదన్న ఎన్నికల్లో నిరూపితం అవుతున్న నేపథ్యంలో ధాటిగానే బదులిస్తోంది. దీంతో రాష్ట్రంలోని ఏ స్థాయి ఎన్నికలు వచ్చినా.. ఈ రెండు పార్టీల నేతల మధ్య భౌతిక దాడులు సైతం చోటుచేసుకున్నాయి. తాజాగా మరో వివాదం బెంగాల్‌లో తెరపైకి వచ్చింది.
ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇరు పార్టీలకు చెందిన నేతల మధ్య హోరాహోరీగా ప్రచారం నడుస్తోంది. ఈ ప్రచారం హోరులో బెంగాల్ జిల్లాలోని మిడ్నాపూర్‌లో ఓ పోస్టర్ కలకలం సృష్టించింది. మిడ్నాపూర్ లోని మదనాపూర్ జిల్లాలో అవిష్కృతమైన ఓ పోస్టర్ లో ప్రధాని నరేంద్ర మోదీని 'మహిషాసురుడు'గా, బెంగాల్ సీఎం మమతా బెనర్జీని 'దుర్గ'గా చూపిస్తూ పోస్టర్‌ను ఏర్పాటు చేశారు స్థానిక తృణముల్ కాంగ్రెస్ నేతలు. ఈ పోస్టర్లో గొర్రెలుగా కాంగ్రెస్, సీపీఎం పార్టీలను పోల్చారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర దుమారం చెలరేగింది. ఈ పోస్టర్‌పై ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక‍్తం చేస్తున్నారు.
ఎవరైనా మేకలకు ఓటేస్తే.. వారిని బలిస్తామంటూ కింద నోట్ కూడా పెట్టారు. దీనిపై స్థానిక బీజేపీ నేత విపుల్ ఆచార్య మండిపడ్డారు. సనాతన ధర్మానికి, ప్రధాని మోదీ, అమిత్ షాకి ఇది తీవ్ర అవమానమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా.. బెంగాల్‌లో 108 మున్సిపాలిటీలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పోస్టర్ రాష్ట్రంలో రాజకీయంగా వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనపై బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తుందని స్థానిక కమలం నేత విపుల్ ఆచార్య తెలిపారు. కాగా, ఈ పోస్టర్‌ను ఎవరు అంటించారో తనకు తెలియదంటూ స్థానిక వార్డ్ మెంబర్ అనిమా సాహా(టీఎంసీ) వెల్లడించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more