ఉక్రెయిన్ పై సైనిక చర్య పేరుతో రష్యా యుద్ధానికి దిగడం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. అమెరికా, బ్రిటన్, జర్మనీ వంటి అగ్రరాజ్యాల దేశాధినేతలు చెప్పినా పుతిన్ ఏమాత్రం ఖాతరు చేయడంలేదు. ఈ నేపథ్యంలో భారత్ లో ఉక్రెయిన్ రాయబారి ఇగోర్ పొలిఖా స్పందించారు. ప్రస్తుతం నెలకొన్న సంక్షుభిత పరిస్థితుల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని కోరారు. మోదీ చెబితే రష్యా అధ్యక్షుడు పుతిన్ సానుకూలంగా వినే అవకాశాలున్నాయని భావిస్తున్నట్టు తెలిపారు. ప్రపంచంలోనే మోదీ అత్యంత శక్తిమంతమైన నాయకుడు అని, ఆయనను ప్రతి ఒక్కరూ గౌరవిస్తారని వివరించారు.
మోదీ వెంటనే స్పందించి రష్యా అధ్యక్షుడు పుతిన్ తో పాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో మాట్లాడాలని పొలిఖా విజ్ఞప్తి చేశారు. పుతిన్ ఎవరి మాట వినకపోయినా మోదీ మాట వింటారన్న నమ్మకం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. "రష్యా దళాలు ఉక్రెయిన్ లోని చాలా ప్రాంతాల్లోకి చొచ్చుకువచ్చాయి. మా సైనికులతో పాటు సాధారణ పౌరులు కూడా రష్యా బలగాల దాడుల్లో చనిపోయినట్టు తెలుస్తోంది. ఈ విపత్కర పరిస్థితుల్లో భారత్ మాకు అండగా నిలవాలి. దౌత్యపరమైన విషయాల్లో భారత్ కు ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. శాంతిస్థాపనకు భారత్ ఎప్పుడూ ముందుంటుంది" అని పొలిఖా వివరించారు.
రష్యా సైనిక దాడి కారణంగా తలెత్తిన సంక్షోభంపై భారత్ వైఖరి పట్ల ఉక్రెయిన్ తీవ్రఅసంతృప్తి వ్యక్తంచేసింది. రెండుదేశాల మధ్య యుద్దం జరుగుతోందని ఇది విపత్కర పరిస్థితులకు దారితీస్తుందని, దీనిని నిలువరించడంలో ప్రధాని మోడీ ఒక్కరికే సాధ్యమని భారత్ లోని అ దేశ రాయబారి ఇగోర్ పోలిఖా చెప్పారు రష్యాతో భారత్కు ప్రత్యేక సంబంధాలు ఉన్నాయని, దీంతో పరిస్థితిని తగ్గించడంలో మరింత చురుకైన పాత్ర పోషిస్తుందని ఉక్రెయిన్ రాయబారి అన్నారు. ప్రపంచలోని అతికోద్ది మంది దేశాధినేతలలో ప్రధాని నరేంద్రమోడీ మాటలను కూడా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వింటాడనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
ఈ అవకాశాన్ని ప్రపంచశాంతి కోసం ప్రధాని మోడీ వినియోగించుకోవచ్చునని, అలాగే ఇది రాజీ చర్యలు భారత్-రష్యా మధ్య సామీప్యానికి కూడా దోహదపడతుందని ఆయన అన్నారు. సరిహద్దుల విషయంలో భారత్ అనుసరిస్తున్న విధానాలనే ఉక్రెయిన్ కూడా అనుసరిస్తుందని, అయితే ఈ విథానాల పట్లు తాము తీవ్ర అసంతృప్తితో ఉందని రాయబారి చెప్పారు. రష్యా మిషన్ డెఫ్యూటీ చీఫ్ రోమన్ బాబైష్కిన్ కామెంట్లు చేసిన మరుసటి రోజునే ఉక్రెయిన్ రాయభారి ఈ మేరకు భారత్ జోక్యం చేసుకోవాలని కోరారు. అయితే అందుకు ముందు రోమన్ బాబైష్కిన్.. బాధ్యతాయుతమైన ప్రపంచ శక్తిగా భారత కీలక పాత్ర పోషిస్తోందని, ప్రపంచ వ్యవహారాలకు ఇది "స్వతంత్ర మరియు సమతుల్య" విధానాన్ని అవలంభిస్తుందని వ్యాఖ్యానించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more