Two pilots killed in chopper crash in Telangana న‌ల్ల‌గొండ‌లో చాప‌ర్ క్రాష్ లో ఇద్దరు మృతి

Chopper of hyderabad s private flying academy crashes 1 pilot killed

chopper crash, 2 pilots killed in chopper crash, Telangana chopper crash, Woman pilot, Chopper crash, Aircraft , SP Rama Rajeshwari, Nalgonda, Telangana

A trainee pilot was killed on Saturday in a chopper crash in Telangana's Nalgonda district. The crash took place at Tungaturthi village of Peddavura block, closer to Nagarjunsagar dam on the Krishna river. Local people gathered to the spot hearing a loud thud to discover the mangled body of the chopper. Cops, medical teams are rushing to the spot. The chopper which crashed is believed to be on a training sortie.

న‌ల్ల‌గొండ‌లో చాప‌ర్ క్రాష్.. మ‌హిళా పైల‌ట్, ట్రైనీ ఇద్దరూ మృతి

Posted: 02/26/2022 05:02 PM IST
Chopper of hyderabad s private flying academy crashes 1 pilot killed

న‌ల్ల‌గొండ జిల్లా పెద్ద‌వూర పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని తుంగతుర్తి గ్రామ స‌మీపంలో శ‌నివారం ఉద‌యం 10:50 గంట‌ల‌కు చాప‌ర్ కుప్ప‌కూలిపోయిన‌ట్లు ఎస్పీ రెమా రాజేశ్వ‌రి వెల్ల‌డించారు. ఘ‌ట‌నాస్థ‌లిని ప‌రిశీలించిన అనంత‌రం ఎస్పీ మీడియాతో మాట్లాడారు. స్థానిక రైతులు, కూలీలు స‌మాచారం అందించిన వెంట‌నే లోకల్ పోలీసులు, స‌ర్పంచ్, ఉప స‌ర్పంచ్ ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని ప‌రిస్థితిని స‌మీక్షించారని తెలిపారు. సెస్నా 152 అనే చాప‌ర్ క్రాష్ అయిన‌ట్లు నిర్ధారించామ‌ని తెలిపారు.

ఇది సాధార‌ణ ఏవియేష‌న్ ఎయిర్ క్రాఫ్ట్ అని పేర్కొన్నారు. దీన్ని శిక్ష‌ణ‌తో పాటు వ్య‌క్తిగ‌త అవ‌స‌రాల‌కు కూడా వినియోగిస్తారు. ప్ర‌మాదానికి గురైన చాప‌ర్‌ను మాచ‌ర్ల‌లోని ఓ ప్ర‌యివేటు ఏవియేష‌న్ అకాడ‌మీకి చెందిన ఎయిర్ క్రాఫ్ట్‌గా గుర్తించామ‌న్నారు. శిక్ష‌ణ‌లో భాగంగా త‌మిళ‌నాడుకు చెందిన ట్రైనీ పైల‌ట్ మ‌హిమ‌.. ప్ర‌యివేటు ఏవియేష‌న్ అకాడ‌మీ నుంచి ఉద‌యం 10:30కి టేకాఫ్ అయింది. అయితే ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది. ప్ర‌మాదం ఎలా జ‌రిగింద‌నే అంశంపై డీజీసీఏ, పోలీసుల‌ ద‌ర్యాప్తు కొన‌సాగుతోంద‌ని ఎస్పీ రెమా రాజేశ్వ‌రి పేర్కొన్నారు.

చాప‌ర్ కూలిన స‌మ‌యంలో భారీ శ‌బ్దం వినిపించింద‌ని స్థానిక రైతులు, కూలీలు పేర్కొన్నారు. ద‌ట్ట‌మైన మంట‌లు, పొగ‌లు వ‌చ్చిన‌ట్లు తెలిపారు. హెలికాప్ట‌ర్ కూలిన వెంట‌నే అక్క‌డికి చేరుకుని పోలీసుల‌కు స‌మాచారం అందించామ‌ని తెలిపారు. నాగార్జున సాగ‌ర్ వైపు నుంచి హెలికాప్ట‌ర్ వ‌చ్చిన‌ట్లు రైతులు పేర్కొన్నారు. ప్ర‌మాదానికి గురైన చాప‌ర్‌ను మాచర్ల మండలం నాగార్జున సాగర్ విజయపురిసౌత్‌లో ఉన్న ఫ్లైటెక్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన ఎయిర్ క్రాఫ్ట్‌గా పోలీసులు గుర్తించారు. హైటెన్ష‌న్ విద్యుత్ వైర్లు త‌గ‌ల‌డంతో అదుపుత‌ప్పి చాప‌ర్ కుప్ప‌కూలిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles